మెరిట్స్ ఆస్తులు ప్రభుత్వపరం: మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా జగన్ నిర్ణయం

అమరావతి: ఇటీవలే గుండెపోటుతో కన్నుమూసిన ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన నివాళి అర్పించనున్నారు. తన ఆప్తుడు, స్నేహితుడు, మంత్రివర్గ సహచరుడు గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకుని రావడానికి చివరి శ్వాస వరకూ అలుపు లేకుండా కృషి చేసిన గౌతమ్ రెడ్డి సేవలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.

 మెట్ట ప్రాంతాల అభివృద్ధి..

మెట్ట ప్రాంతాల అభివృద్ధి..

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల (మెరిట్స్‌)ను దివంగ‌త మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. వైఎస్ఆర్సీపీ సీనియ‌ర్ నేత‌, లోక్‌సభ మాజీ సభ్యుడు మేక‌పాటి రాజమోహన్‌ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు వంటి పలు మెట్ట ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి గౌతమ్ రెడ్డి కృషి చేశారని రాజమోహన్ రెడ్డి వివరించారు.

రూ.225 కోట్ల ఆస్తి ప్రభుత్వానికి..

రూ.225 కోట్ల ఆస్తి ప్రభుత్వానికి..


ఉదయగిరిలో వంద ఎకరాల్లో తాను ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్‌ కళాశాలకు సంబంధించిన 225 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మేకపాటి స్పష్టం చేశారు. ఇంజినీరింగ్‌ కళాశాలను వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఉదయగిరిలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని, అవసరమైతే తన సొంత ఖర్చులతో మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్..

సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్..

రాజమోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తి పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా మెరిట్స్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీనికి అవసరమైన చర్యలను త్వరలోనే తీసుకుంటానని అన్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేస్తామని చెప్పారు. అలాగే- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ఓ ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి ఆయనకు భరోసా ఇచ్చారు.

మెట్ట ప్రాంతాలు..

మెట్ట ప్రాంతాలు..

ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతో పాటు ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించడానికి ఉద్దేశించిన వెలుగొండ ప్రాజెక్ట్, సోమశిల హై లెవెల్‌ కెనాల్, సోమశిల ఫేజ్‌-1, ఫేజ్‌-2 పథకాలను శరవేగంగా పూర్తి చేయాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి.. వైఎస్ జగన్‌కు సూచించారు. ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలను డెల్టాగా మార్చడానికి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

మెరిట్స్‌ సమీపంలోనే

మెరిట్స్‌ సమీపంలోనే

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి మెరిట్స్ సమీపంలోనే అంత్యక్రియలను నిర్వహించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేకపాటి కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి చేతుల మీదుగా అంత్యక్రియలు సాగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+