రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!!

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ వ్యవస్థలో కొత్త మార్పులు చేసింది. కొత్త కార్డుల మంజూరు తో పాటుగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేసింది. గతం లో ఉన్న రేషన్ వాహనాలను తప్పించి.. రేషన్ దుకాణాల వద్దే సరఫరా చేస్తోంది. ఇక త్వరలో రేషన్ షాపుల్లోనే మాల్స్ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఇక, తాజాగా రేషన్ కార్డుల కు సంబంధించిన సేవల్లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం లబ్దిదారులకు అవకాశం కల్పించింది. కాగా, వీరికి సంబంధించి రైస్ కార్డ్ దరఖాస్తు సేవ రుసుం (సర్వీస్ ఛార్జ్)లను పెంచింది. కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు సేవా ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ. 24 సేవా రుసుం కలిగిన సేవలు రూ.100కు పెంచారు. అదే విధంగా రూ 48గా ఉన్న రైస్ కార్డ్ విభజన సేవ రూ.200కు పెరిగింది. ఇక.. మీసేవ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల రైస్ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రేషన్ కార్డు పోగొట్టుకున్న వారికి డూప్లికేట్ కార్డు పొందాలన్నా.. వివరాలు తప్పుగా ఉంటే సరి చేసుకునేందుకు.. అదే విధంగా ఉన్న సభ్యులను తొలిగించటం.. చిరునామా మార్పు... కార్డు స్ప్లిట్ వంటి వాటి కోసం ఈ సర్వీసు ఛార్జీల్లో మార్పులు జరిగాయి.

ap-govt-made-key-decisions-over-ration-services-for-the-eligible-beneficiaries-as-latest-proposals

ప్రభుత్వం తాజా నిర్ణయాలతో

ఇప్పటికే రేషన్ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త స్మార్ట్ కార్డులు రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ పంపిణీ చేస్తోంది. వృద్దులకు రేషన్ డీలర్లు ఇంటికి వెళ్లి సరుకు పంపిణీ చేస్తున్నారు. మిగతావారు దుకాణాల వద్దకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో షాపుల ద్వారా బియ్యం, పంచదార మాత్రమే పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసేంది. కానీ ఇప్పుడు రాగులు, జొన్నలు, గోధుమ పిండి కూడా లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. గోధుమ పిండిని కిలో రూ.20కే అందిస్తున్నారు. ప్రస్తుతం కిలో రూ.70గా ఉండగా.. కేవలం రూ.20కే ప్రభుత్వం అందిస్తోంది. త్వరలోనే విలేజ్ మాల్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్ని రకాల సరుకులు ఒకే చోట అందే విధంగా ప్రణాళికలు రూప కల్పన చేస్తున్నారు. ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో అమలు చేసి... దశల వారీగా విస్తరించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+