ఆర్టీసీ విలీనానికి రంగం సిద్దం : సీఎంకు మధ్యంతర నివేదిక : కేబినెట్ లో కీలక నిర్ణయం..!

Recommended Video

    ప్రభుత్వంలో APSRTC విలీనానికి రంగం సిద్దం || AP Govt Moving To Merge APSRTC With Govt

    రోడ్డు రవాణా రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీయస్ ఆర్టీసి ఇక ప్రభుత్వంలో విలీనానికి రంగం సిద్దం అయింది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందుగా ఇచ్చిన హమీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ లో నే ఇదే అంశం పైన అధ్యయనం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయ రెడ్డి నాయకత్వంలో ఈ కమిటీ సిఫార్సులను ముఖ్యమంత్రికి నివేదిక రూపంలో అందించ నున్నారు. దీని పైన బుధవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

    సంస్థను ఒకే దశలో విలీనం సాధ్యాసాధ్యాల పైన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే తొలి విడతా ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రవాణా శాఖ సమీక్ష లో అధికారులు ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందచేస్తారు. దీని కోసం ఆర్టీసిలో పని చేసే ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    సీఎంకు మధ్యంతర నివేదిక..

    సీఎంకు మధ్యంతర నివేదిక..

    ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి రంగం సిద్ధమైంది. ఇవాళ సీఎం జగన్ కు మధ్యంతర నివేదిక కమిటీ ఇవ్వనుంది. మధ్యాహ్నం రవాణా శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీసీని రవాణాశాఖ పరిధిలోకి తీసుకురావాలని కమిటీ చిస్తుంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అర్టీసి ఉద్యోగులకు..కార్మికులకు హామీ ఇచ్చారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. ఈ మేరకు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ 10న జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు..దీనికి అనుగుణంగా రిటైర్డ్ పోలీసు అధికారి ఆంజనేయరెడ్డి సారధ్యంలో నిపుణుల కమిటీ వేసారు. ఆ కమటీకి మూడు నెలల సమయం ఇచ్చారు. దీనికి సంబంధించిన మధ్యంతర నివేదికను కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి అందచేయనున్నారు. ఆర్టీసీ ప్రస్తుతం ఆర్దికంగా నష్టాల్లో ఉంది. అదే విధంగా ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు ఉన్నాయి. దీంతో పాటుగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలంటే కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నట్లు చెబుతున్నారు. వాటిని దశల వారీగా న్యాయ నిపుణుల సలహాల మేరకు ముందుకు వెళ్లాల్సి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను..కమిటీ అధ్యయనం చేసిన అంశాలను మధ్యంతర నివేదిక లో నివేదించనున్నారు.

    62 ఏళ్ల ఆర్టీసి ఇక ప్రభుత్వంలోకి...

    62 ఏళ్ల ఆర్టీసి ఇక ప్రభుత్వంలోకి...

    1958లో ప్రారంభమైన ఏపీఎస్ ఆర్టీసీ ప్రస్థానంలో 128 డిపోలు, 4యూనిట్లలో 52 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఏపీయస్ ఆర్టీసి సంస్థ 2014లో రాష్ట్ర విభజన ద్వారా రెండుగా చీలింది. ఆర్టీసి ఉమ్మడి ఆస్తుల పంపకాల పైన కేంద్రం ప్రభుత్వం నియమించిన షీలా బేడీ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. అయితే..ఉమ్మడి ఆస్థిగా ఉన్న కొన్నింటి పైన మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇక, ఇప్పుడు ఏపీలోని ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా నిపుణుల కమిటీ కొన్ని సమస్యలను తమ నివేదికలో పొందు పర్చినట్లు తెలుస్తోంది. అయితే, కార్మికులు..సిబ్బంది..అధికారులను దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నోటీ ఫై చేయాలని కమిటీ సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా సంస్థ విలీనానికి సంబంధించిన అంశాల కొన్ని చిక్కు ముడులు ఉండటంతో సిబ్బందిని ఒక కటాప్ డేట్ మేరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినట్లయితే ఉద్యోగుల్లో ప్రభుత్వ మీద నమ్మకం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో సంస్థకు ఉన్న అప్పుల విషయం పైనే కమిటీ ఎటువంటి సూచనలు చేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.

    కేబినెట్ లో చర్చ..నిర్ణయం

    కేబినెట్ లో చర్చ..నిర్ణయం

    కమిటీ ఇచ్చే మధ్యంతర నివేదిక పైన బుధవారం జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కమిటీకి నిర్ణయించిన కేబినెట్..ఇప్పుడు రెండో కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, నివేదిక ఆధారంగా నిర్ణయం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు నివేదికలో ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం అయితే..ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారు..తుది నిర్ణయం దిశగా ఎటువంటి కార్యాచరణ అమలు చేస్తారు.. అనే ఉత్కంఠ ఇప్పుడు ఆర్టీసి కార్మికుల్లో కనిపిస్తోంది. దీంతో..అందరూ ముఖ్యమంత్రి నిర్వహిస్తన్న సమీక్ష కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+