ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు, ప్రశ్నా పత్రాల విధానం మార్పు - షెడ్యూల్..!!
ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నెల ముందుగానే ఫిబ్రవరిలో పరీక్షల నిర్వహణకు నిర్ణయించింది. పరీక్షా విధానంలోనూ మార్పులు తెచ్చింది. తాజా నిర్ణయం మేరకు ఇక పై రోజుకు ఒక్క సబ్జెక్టుకే పరీక్షలు జరగనున్నాయి. మొదట సైన్స్ గ్రూపులకు, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపులకు పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పైన మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
నెల ముందే పరీక్షలు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ విద్యాసంవత్సరంలో ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రణాళికలో సిద్దమైంది. సాధారణంగా ప్రతీ ఏటా మార్చి నెలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. కాగా, ఈసారి సీబీఎస్‌ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో తరగతులను నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలన్నీ పూర్తవుతాయి. అందుకు అనుగుణంగానే పరీక్షల విధానంలోనూ పలు మార్పులు జరిగాయి. మొదట సైన్స్ విద్యార్థులకు గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభం కానున్నాయి రోజుకు ఒక్క సబ్జెక్టు పరీక్షే ఉంటుంది. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు అదేరోజు బైపీసీ, ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు.

రోజుకు ఒక్క సబ్జెక్టే
ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా పరీక్షల నిర్వహణలో మార్పులు తెచ్చారు. ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే ఆ రోజు ఆ సబ్జెక్టు ఒక్కటే ఉంటుంది. ఎంబైపీసీ గ్రూపును తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులూ జీవశాస్త్రం చదివే అవకాశం వచ్చింది. అందువల్ల ఒకేరోజు 2 పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టి ఒక రోజు ఒకే పరీక్ష పెట్టనున్నారు. సైన్స్ గ్రూపు సబ్జెక్టులన్నీ పూర్తయ్యాక చివరిలో భాషల పరీక్షలు ఉంటాయి. అనంతరం ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివరలో నిర్వహించాలని భావిస్తున్నారు. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో పూర్తిగా ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేశారు.
ప్రశ్నా పత్రాల విధానం
అదే విధంగా ఎంబైపీసీ, జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే వెసులుబాటును సైతం కల్పించారు. ఆర్ట్స్ విద్యార్థులు సైతం కొందరు ఐచ్ఛికంగా సైన్స్ సబ్జెక్టులు ఎంచుకున్నారు. మరికొందరు కొందరు సైన్స్ గ్రూపు విద్యార్థులు రాజనీతిశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం ఎంపిక చేసుకున్నారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ దేనికైనా అర్హత సాధించేందుకు ఇలా సబ్జెక్టులను ఎంచుకున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రశ్నపత్రాల విధానాన్ని కూడా మార్చారు. భౌతిక శాస్త్రం, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులను 85 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. మిగతా మార్కులు రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. అన్ని పేపర్లలోనూ ఒక్క మార్కు ప్రశ్నలను కొత్తగా తీసుకొచ్చారు. ఇకపై జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం 43 మార్కులకు, జంతుశాస్త్రం 42 మార్కులకు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications