ఎయిడెడ్ వివాదంలో కొత్త టర్న్ - 418 పాఠశాలలకు నోటీసులు : 40మంది లోపు ఉంటే క్లోజ్..!!

ఏపీలో కిద్ది రోజుల క్రితం వరకు చర్చనీయాంశంగా మారి..అనేక విమర్శలకు కారణమైన ఎయిడెడ్ విద్యా సంస్థల వ్యవహారంలో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. ఎయిడెడ్ సంస్థలను యాజమన్యాలు ప్రభుత్వానికి అప్పగించటం ఐచ్చికమని చెప్పిన ప్రభుత్వం నాలుగు ఆప్షన్లను సూచించింది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం తాజా ఆలోచనలతో ముందుకు వచ్చింది. రాష్ట్రంలో 418 ఎయిడెడ్‌ పాఠశాలల అనుమతులను రద్దు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

40లోపు విద్యార్థులున్న వీటిని మూసివేసేందుకు నివేదికలు కోరింది. రెండేళ్లుగా పిల్లల ప్రవేశాలు తగ్గడం, ఈ ఏడాది అక్టోబరు 31వరకు అవకాశం కల్పించినా ప్రవేశాలు పెరగకపోవడంతో వీటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2019-20, 2020-21 సంవత్సరాల్లో 840 పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిందని, ఈ ఏడాది అక్టోబరు 31నాటికి ఉన్న ప్రవేశాలను పరిశీలించగా.. 418 బడులు ఈ ఏడాదీ పిల్లల సంఖ్యను పెంచడంలో విఫలమయ్యాయని పేర్కొంది.

AP Govt planning to close aided shools which have strength below 40 students

40మందిలోపు విద్యార్థులుండి మూతపడే 418 పాఠశాలల్లో అత్యధికంగా 133 బడులు కృష్ణా జిల్లాలోనే ఉన్నాయి. అత్యల్పంగా 4 పాఠశాలలు అనంతపురంలో ఉన్నాయి. వీటిల్లోని కొన్ని పాఠశాలల్లో సున్నా ప్రవేశాలున్నాయని ఇప్పటికే ఉపాధ్యాయులను వేరే బడులకు సర్దుబాటు చేశారు. 20లోపున్న వాటి అనుమతుల రద్దుకు యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులిచ్చారు. విద్యాహక్కు చట్టం, ఉత్తర్వు-1 నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు నివేదికలు పంపాలని సూచించింది.

ఉత్తర్వు-1 ప్రకారం 40మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉండాలి. ఈ పాఠశాలల్లో 40మందిలోపు విద్యార్థులు ఉన్నందున వీటన్నింటి అనుమతులను రద్దు చేసే అవకాశముంది. ఇప్పటికే 20లోపు విద్యార్థులున్న బడుల అనుమతులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్లేదీ... యాజమన్యాలు ప్రభుత్వానికి ఏం నివేదికలు ఇస్తాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+