ఏపీలో రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ - ఇక నుంచి కొత్తగా..!!
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు అందిస్తున్న సరుకుల తో పాటుగా మరిన్ని అందించేందుకు నిర్ణయించింది. కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేపట్టింది. పేదలకు ఇచ్చే చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా చర్యలు మొదలు పెట్టింది. ప్రతీ ఇంటికి సచివాలయ సిబ్బంది కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రేషన్ సరుకులను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం జిల్లాల వారీగా కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తోంది. సాంకేతికత ను వినియోగించి దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేలా స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ పొందుపరిచారు. రేషన్ తీసుకున్న వెంటనే సమాచారం కేంద్ర, జిల్లా కార్యాలయాల్లోని డాష్ బోర్డుకు చేరే విధంగా ఏర్పాటు చేసారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వచ్చి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 15 కల్లా 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.

ఇక.. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు, అడ్రస్ మార్పు చేసుకున్నవారికి స్మార్ట్ రేషన్ కార్డులిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు కూడా అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందు కోసం ప్రస్తుతం రేషన్ డీలర్ల వద్ద వద్ద ఉన్న 'ఈ పోస్' యంత్రాలను ఆధునీకరిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్ తంగా 29 వేల 797 రేషన్ దుకాణాలు ఉన్నాయని, ప్రజల అవసరాల దృష్ట్యా రేషన్ దుకాణాలు పెంచాలని సీఎం ఆదేశించారన్నారు. అధ్యయనం చేసి అవసరమైన ప్రాంతాల్లో సబ్ డిపోలు ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్లు సరుకుల పంపిణీలో అలసత్వం ప్రదర్శించవద్దని తెలిపారు. ప్రభుత్వం అందించే సరుకులు అసలైన లబ్ధిదారులకు అందాలని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications