ఉద్యోగుల బకాయిల చెల్లింపు పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మది నెలలు పూర్తి అయింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కూటమి నేత లు హామీ ఇచ్చారు. బకాయిలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏల చెల్లింపు, పీఆర్సీ వంటి విషయాల పైన ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజా బడ్జెట్ లోనూ ఉద్యోగుల సమస్యల పైన ప్రస్తావన చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపు పైన కీలక ప్రతిపాదన సిద్దమైంది. అమలు పైన నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం కసరత్తు
ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన 2025-26 వార్షిక బడ్జెట్ లో ఉద్యోగుల అంశా లకు ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన ఉంది. కూటమి అధికారంలోకి రావటానికి ఉద్యోగులు మెజార్టీ సంఖ్యలో మద్దతు ఇచ్చారు. వైసీపీ హయాంలో పెండింగ్ బకాయిలు.. రివర్స్ పీఆర్సీ వంటి అంశా లతో నాటి ప్రభుత్వం పైన ఉద్యోగులు ఆగ్రహంతో కనిపించారు. ఇక, కూటమి అధికారంలోకి వచ్చి తరువాత రాష్ట్ర ఆర్దిక పరిస్థితి కారణంగా పీఆర్సీతో సహా.. పెండింగ్ బకాయిలు.. అదే విధంగా రావాల్సిన డీఏల పైన ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు. మాజీ సీఎం జగన్ 2024 ఎన్నికల ముందు పీఆర్సీ కమిషన్ ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పీఆర్సీ కమిష నర్ రాజీనామా చేసారు. కొత్త పీఆర్సీ ఏర్పాటు కాలేదు.
దశల వారీ చెల్లింపు
ఈ బడ్జెట్ లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు భావించారు. ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపు పైన చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు దాదాపు రూ 25 వేల కోట్ల బకాయిలు ఉన్న ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో కొంత మేర నిధులను బకాయిల కింద చెల్లించింది. ఇంకా, పెద్ద మొత్తంలో చెల్లించాల్సినవి ఉండటంతో దశల వారీగా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరుతో ప్రస్తుత ఆర్దిక సంవత్సరం పూర్తి కానుంది. కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభం తరువాత పలు నిర్ణయాలు.. పథకాలు అమలు దిశగా ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదనలు చేసింది.

నెలాఖరు విడుదల
దీంతో, ఉద్యోగులకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్, రిటైర్‌మెంట్ ప్రయోజనాల రూపంలో రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు చెల్లించాలని భావిస్తోంది. ఈ నెలాఖరుకి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో పెండింగ్ డీఏల్లో ఒకటి అయినా ముందుగా విడుదల చేయాలనే ప్రతిపాదన పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకో ల్సి ఉంది. రాష్ట్ర ఆర్దిక పరిస్థితుల కారణంగా ఉద్యోగ సంఘాల నేతలు సైతం బకాయిల చెల్లింపు పైన ప్రభుత్వం పై ఒత్తిడి తేవటం లేదు. అదే సమయంలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు పైన ప్రభుత్వం ఆలోచన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక, బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎంత మేర విడుదల చేస్తుందనేది ఇప్పుడు ఉద్యోగుల్లో ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications