తల్లికి వందనం పెండింగ్ నిధుల జమ ముహూర్తం, అర్హుల జాబితా- ఈ సారి వీరికీ అమలు..!!
తల్లికి వందనం లబ్ది దారులకు ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే తల్లికి వందనం ఈ సంవత్సరం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, కొత్తగా పాఠశాలలు.. కాలేజీల్లో చేరిన వారికి నిధులు విడుదల కాలేదు. అదే విధంగా అర్హత ఉండీ అందని వారికి సైతం మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. అర్హుల జాబితాలను సిద్దం చేసారు.
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ ఏడాది వరుసగా రెండో సారి నిధులను ప్రభుత్వం ఇప్పటికే అర్హులైన లబ్ది దారుల ఖాతాల్లో జమ చేసింది. అయితే, కొత్తగా బడులు.. కాలేజీల్లో చేరిన వారికి నిధుల జమ కోసం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిధుల జమ వేళ అర్హత ఉండీ.. అందని వారికి ఇప్పుడు నిధులు జమ చేయనున్నారు. వీరితో పాటుగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగా దాదాపు 2.80 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలుత వీరికి ఆగస్టు 30వ తేదీనే నిధులు జమ చేయాలని భావించారు. అయితే, వాయిదా పడింది. ఇప్పుడు వచ్చే వారం వీరి ఖాతాల్లో నిధుల జమకు ముహూర్తం ఖరారు చేసారు. వీరి జాబితాలను ఇప్పటికే అధికారులు నిర్దారించారు.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో
పథకం అర్హత ఉండీ రాని వారి నుంచి అభ్యంతరాలు.. దరఖాస్తులు స్వీకరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హత ఉండి డబ్బులు పడనివారిని గుర్తించారు. లబ్ది దారుల జాబితాల ను ప్రదర్శించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు దీనిని వర్తింపచేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా స్కూల్, కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది.
స్కూళ్ల నిర్వహణ కోసం రూ.2 వేలు ప్రభుత్వం తీసుకుంటోంది. వీటిని జిల్లాల కలెక్టర్ల అకౌంట్లలో వేస్తోంది. మిగతా రూ.13 వేలు తల్లిదండ్రులకు అందిస్తోంది. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ పథకం అమలు చేయగా.. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో వర్తింపచేస్తోంది. దీంతో... ఈ వారంలో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు ఉండటంతో.. ఈ నెల 7 లేదా 8వ తేదీన లబ్ది దారుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications