సురేఖపై కీలక నిర్ణయం: కేబినెట్ ప్రక్షాళనకు హైకమాండ్ ఆమోదం- ఇన్, ఔట్ వీరే..!!
ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారింది. వరుస భేటీలు.. మంత్రాంగాలతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ వివాదం వేళ ముఖ్య నేతలు ఢిల్లీలో మొహరించారు. కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చలు చేసారు. కొండా సురేఖ పైన ఒక నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో కేబినెట్ ప్రక్షాళనకు నిర్ణయించారని సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో మార్పులతో పాటుగా.. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలో తుది కసరత్తు జరుగుతోంది.
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు మకాం వేసారు. కొండా సురేఖ వ్యవహారంలో చర్యలు తీసుకుంటూనే.. ఆచి తూచి వ్యవహరించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. అందులో భాగం గానే కొండా సురేఖతో మంత్రిపదవికి రాజీనామా చేయించేందుకు నిర్ణయించింది. అదే సమయం లో పార్టీలో ఆమె భవిష్యత్తుకు భరోసా ఇచ్చి రాజీనామా చేయించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్ తెలుస్తోంది. అయితే అధిష్ఠానం రాజీనామాను ప్రతిపాదిస్తే దానికి కొండా సురేఖ అంగీకరిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన కేసీ వేణుగోపాల్ పార్టీ తెలంగాణ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. సంప్రదింపుల ప్రక్రియను ముఖ్యమంత్రితోనే మొదలుపెట్టారు. సీఎం రేవంత్‌తో ఆయన గంటకు పైగా చర్చలు జరిపారు. ఈ భేటీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ పైనా ఒక నిర్ణయానికి వచ్చారు.

కేబినెట్ ప్రక్షాళన.. కీలక మార్పులు
సురేఖ పై చర్యలు తీసుకోకుంటే పార్టీకి నష్టమని రేవంత్ నివేదించినట్లు సమాచారం. సురేఖతో పాటు మరికొందరి వ్యవహార శైలికి సంబంధించిన నివేదికలు, మంత్రుల శాఖల వారీ పనితీరు రిపోర్టును ముఖ్యమంత్రి అధిష్ఠానానికి అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో.. కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా సురేఖ తో పాటుగా మరో ఇద్దరిని తప్పించే అవకాశం ఉందని సమాచారం. వారి స్థానంలో ముగ్గురు కొత్తగా కేబినెట్ లో ఛాన్స్ దక్కనుంది. సురేఖ స్థానంలో ఎమ్మెల్సీ విజయ శాంతి పేరు ఖాయమైనట్లు సమాచారం.
సీఎం రేవంత్ కేబినెట్ లోకి విప్ ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. మహిళతో భర్తీ చేయాలంటే కేకే కుమార్తె విజయ లక్ష్మి పేరు వైపు మొగ్గు చూపుతున్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. అదే విధంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. ప్రస్తుత కేబినెట్ లో బీసీ మంత్రికి టీపీసీసీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారు. అదే విధంగా స్పీకర్ ప్రసాద కుమార్ ను సైతం కేబినెట్ లోకి తీసుకుంటారని.. ఆయన స్థానంలో ఉమ్మడి కరీంనగర్ ఎస్సీ వర్గానికి చెందిన మంత్రిని స్పీకర్ గా చేస్తారని ప్రచారం సాగుతోంది.













Click it and Unblock the Notifications