జోర్డాన్ నుంచి బహ్రెయిన్ దాకా..: అంటుకున్న మిడిల్ ఈస్ట్: అమెరికా తాజా దాడులు

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్‌పై తాజా దాడులకు దిగింది. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన లక్ష్యాలపై విరుచుకుపడింది. ఒమన్ గల్ఫ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడమే దీనికి కారణం. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్.. ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికాకు చెందిన బేస్ క్యాంప్ లపై బాంబుల వర్షాన్ని కురిపించింది.

ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు చల్లారినట్టే కనిపించిన ఈ యుద్ధం.. మళ్లీ మొదటికొచ్చినట్టయింది. మున్ముందు మరింత తీవ్రంగా దాడులు చేపడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించడం.. అక్కడి తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. ఈ దాడులను అటు అమెరికా, ఇటు ఇరాన్.. ఆత్మరక్షణలో భాగమని చెప్పుకొన్నాయి.

Iran launched a retaliatory operation using missiles and drones on US Base after its fresh strikes

ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనిపై తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్‌ పెట్టింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ సైనికులపైనా ఐఆర్‌జీసీ దాడుల ప్రయత్నాలకు ప్రతీకారానికి దిగామని తెలిపింది.

ఇరాన్‌లోని ఖేష్మ్ ఐలాండ్, జాస్క్, సిరిక్ రీజియన్, జిరోఫ్ట్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది. అంతే ఘాటుగా స్పందించింది. తన భూభాగం నుంచి అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీన్ని ధృవీకరించింది. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్‌, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామని ప్రకటించింది.

అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్‌క్యూ-4, ఎమ్‌క్యూ-9 డ్రోన్ల హ్యాంగర్లే లక్ష్యంగా జోర్డాన్‌లో దాడులు జరిగాయని అధికారిక మీడియా ఐఆర్‌ఐబీ పేర్కొంది. ఈ దాడిలో పలు డ్రోన్లు ధ్వంసం కావడంతో పాటు అమెరికా ప్రాణనష్టాన్ని కూడా చవి చూసిందని వివరించింది. దీనిపై అమెరికా గానీ, జోర్డాన్ గానీ అధికారిక ఎటువంటి ప్రకటనా వెలువడించలేదు.

మరోవైపు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ఎలాంటి సాహసానికి ఒడిగట్టినా అంతకంటే రెట్టింపుగా సమాధానం ఇస్తామని అన్నారు. హోర్ముజ్ జలసంధిలో సముద్రపు ల్యాండ్ మైన్లు అమర్చేందుకు ఇరాన్ చేసిన విఫలయత్నానికి, జోర్డాన్ స్థావరాలపై దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దీంతో దాడుల తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తోన్నాయి.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జోర్డాన్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వార్ సైరన్లు మోగాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో మఫ్రాక్ సిటీ గగనతలంపై పలు రాకెట్లను జోర్డాన్ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+