స్థానికంపై జగన్ ఫుల్ ఫోకస్: పులివెందుల ప్రజాదర్బార్ లో..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.

అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 నియోజకవర్గాలకే పరిమితమైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును నిలుపుకోవడం, అదే స్థాయిలో స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అదే స్థాయిలో పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.

YS Jagan Hold Praja Darbar in Pulivendula Urges YSRCP Cadre to Contest Every Local Body Seat in AP

ఈ క్రమంలో పులివెందులలో పర్యటిస్తోన్న వైఎస్ జగన్ అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించారు. భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఆలకించారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు.

జోర్డాన్ నుంచి బహ్రెయిన్ దాకా..: అంటుకున్న మిడిల్ ఈస్ట్: అమెరికా తాజా దాడులు
జోర్డాన్ నుంచి బహ్రెయిన్ దాకా..: అంటుకున్న మిడిల్ ఈస్ట్: అమెరికా తాజా దాడులు

స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని, ప్రతి స్థానంలో పోటీ చేసేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని అన్నారు. ఏకగ్రీవాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని పునరుద్ఘాటించారు. దీనికోసం గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. అధికార బలం, పోలీసులను అడ్డుపెట్టుకుని ఒత్తిళ్లు, దౌర్జన్యాలకు పాల్పడితే ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలని కోరారు. ప్రతి కార్యకర్తలకూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇకపై తిరుమలలో ఎయిర్ పోర్ట్ తరహా స్మార్ట్ లగేజీ సిస్టమ్: జీఎంఆర్ ఎంట్రీ
ఇకపై తిరుమలలో ఎయిర్ పోర్ట్ తరహా స్మార్ట్ లగేజీ సిస్టమ్: జీఎంఆర్ ఎంట్రీ

తమ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ వివరించాలని జగన్ చెప్పారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ, నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+