ఉద్యోగులకు పండుగలాంటి అప్డేట్ - ఖాతాల్లో చెక్ చేసుకోండి..!!
ఉద్యోగులకు పండుగలాంటి అప్డేట్ - ఖాతాల్లో చెక్ చేసుకోండి..!!
ఏపీ ఉద్యోగులకు ఉగాది ముందే పండుగ లాంటి వార్త. ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపు ప్రక్రియ మొదలు పెట్టింది. తాజాగా ఉద్యోగులకు రూ 6,200 కోట్లు బకాయిలు విడుదల చేసేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు వారి ఖాతాల్లో నిధుల జమ మొదలు అయింది. వరుస క్రమంలో ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయించిన బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆర్దిక శాఖ అధికారులు చెబుతున్నారు.
బకాయిల విడుదల
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. ఉద్యోగుల ఖాతాల్లో బకాయిల చెల్లింపు చేస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సి ఉన్న ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలను చెల్లింపు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ. 6 వేల 200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. బకాయిలు జమ విషయాన్ని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు.

చంద్రబాబు హామీతో
తాజాగా ఉద్యోగ సంఘాల నేతల అభ్యర్ధన మేరకు సీఎం చంద్రబాబు బకాయిల చెల్లింపు పైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఇప్పుడు ఉద్యోగుల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద ఆర్థిక శాఖ రూ.6,200 కోట్లు విడుదల చేసింది. కాగా జనవరిలోనూ రూ.1,033 కోట్ల బకాయిలను ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయటం.. తమ ఖాతాల్లో జమ కావటం పైన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల కు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో పెండిండ్ డీఏల గురించి చర్చ జరుగుతోంది. కాగా, కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభం తరువాత డీఏల విషయం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఖాతాల్లో జమ
ఇక, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు పైన ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావన చేస్తున్నారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితుల కారణంగా కొంత సమయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవు తోంది. ముందుగా గత ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఉన్న బకాయిల చెల్లింపు పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. అందులో భాగంగా తొలి విడతలో రూ 1,033 కోట్లు, రెండో విడతగా రూ 6,200 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, విడతల వారీగా పెండింగ్ ఉన్న మిగిలిన బకాయిల పైన ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications