వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: ఏపీలో వేల సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల

|
Google Oneindia TeluguNews

డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొన్ని కారణాల చేత నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం 7675 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. .

నవంబర్ 1 నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి గంటా తెలిపారు. దరఖాస్తులు 16వ తేదీ వరకూ పొందవచ్చన్నారు. స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజస్)కు డిసెంబర్ 6 నుంచి 10 వరకు, స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజస్)కు డిసెంబర్ 11న పరీక్ష ఉంటుందని తెలిపారు. 12, 13 తేదీల్లో పీజీ టీచర్స్ రాతపరీక్ష ఉంటుందని తెలిపారు.

AP govt releases the schedule for filling up of teacher posts

ప్రభుత్వ, జెడ్పీ పోస్టులు 4,341, మునిసిపల్ పోస్టులు 1,100, మోడల్ స్కూల్స్ లో 909 పోస్టులు, బీసీ వెల్ఫేర్ లో 300 పోస్టులు, ఎస్జీటీ 3,666 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 1,625 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్స్ 452 పోస్టులు భర్తీ చేయనున్నామని గంటా వెల్లడించారు. నవంబర్ 19 నుంచి సెంటర్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చని అన్నారు. నవంబర్ 17 నుంచి ఆన్ లైన్ మాక్ టెస్టులు నిర్వహిస్తామని, 20 తరువాత హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.

Recommended Video

ప్రభుత్వం నాన్చుడుతో ఇంటిదారి పడుతున్న అభ్యర్థులు

English summary
Good news for the AP unemployee. The government has released the schedule to fill tha vacancies of 7675 teacher posts.The time table regarding this has been anounced by Minister Ganta Srinivas rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X