కడప మేయర్‌ సురేష్‌బాబుపై మళ్లీ అనర్హత వేటు, వాట్ నెక్స్ట్..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప మేయర్ సురేశ్ బాబు పైన అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలోనే పలు ఆరోపణల కారణంగా సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తెలిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఆ సమయంలో సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచన మేరకు సురేష్ బాబుకు మరో అవకాశం కల్పించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సురేశ్ బాబు పైన వచ్చిన ఆరోపణల నిర్ధారణతో అనర్హత వేటు వేస్తూ నిర్ణయించింది.

కడప మేయర్ సురేశ్ బాబు పదవి కోల్పోయారు. సురేష్ బాబు పైన అనర్హత వేటు వేస్తూ ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సురేష్ బాబు కుటుంబీకులు కడప నగర పాలక సంస్థ లో సివిల్ కాంట్రాక్టులు చేపట్టారని.. ఎమ్మెల్సీ మాధవి రెడ్డి గత ఏడాది ఫిర్యాదు చేసారు. దీని పైన విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి కాంట్రాక్టులు చేసిన విషయం వాస్తవమేనని తేల్చి ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో, పురపాలక శాఖ ఈ ఏడాది మార్చి 24న సురేష్ బాబు కు నోటీసులు జారీ చేసింది. ఆ తరువాత పదవి నుంచి తెలిగిస్తూ మేలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, సురేష్ బాబు ఈ ఉత్తర్వుల పైన హైకోర్టును ఆశ్రయించారు. ఉద్దేశ పూర్వకంగా తనను మేయర్ పదవి నుంచి తప్పించారని పేర్కొన్నారు. సురేష్ బాబు పిటీషన్ పైన హైకోర్టులో వాదనలు జరిగాయి.

ap-govt-removes-suresh-babu-from-kadapa-mayor-post-details-here

సురేష్ బాబు నుంచి పదవి తొలిగింపు పై హైకోర్టును ఆశ్రయించటంతో పాటుగా.. తన వాదన వినిపించేందుకు మరో అవకాశం కల్పించాలని కోరారు. దీంతో, సురేష్ బాబుకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఆయన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తన వాదన వినిపించారు. విజిలెన్స్ విచారణ కమీషన్ వాంగ్మూలం పరిగణలోకి తీసుకున్న మున్సిపల్ శాఖ మేయర్ ను పదవి నుంచి తెలిగించింది. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్ ను ఈ రోజు అధికారులు సురేష్ బాబుకు అందించనున్నారు. కాగా, సురేష్ బాబు ను పదవి నుంచి తప్పించటంతో.. ఇప్పుడు వైసీపీ నేతలు ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+