యూఎన్ఓ లో ప్రభుత్వ బడి విద్యార్ధులు, అరుదైన ఘనత - సామర్ధ్యం చాటేలా..!!
దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పదిమంది విద్యార్థుల బృందం యునెస్కో లో జరిగిన ఎస్టీజి సదస్సులో పాల్గొన్నారు. ఇదే విద్యార్థులు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను సందర్శించనున్నారు.
యూఎన్ఓ సదస్సులో విద్యార్ధులు
ఐక్యరాజ్యసమితిలో ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రసంగించారు. గత నాలుగేళ్లలో ఏపీ విద్యావ్యవస్థ పటిష్టమైన తీరు అమలవుతున్న విద్యా విధానాలపై యూఎస్ ఎస్టిజి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగే ఈ సదస్సులో భాగంగా విద్య అంశంపై మాట్లాడాలని ఏపీ విద్యార్థులకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం పంపింది.

లారీ డ్రైవర్, రైతుకూలీ, ఆటో డ్రైవర్, మెకానిక్ వంటి నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఐక్యరాజ్యసమితి వేదిక ప్రసంగించే అవకాశం దక్కింది. ఈ విద్యార్థులు ప్రపంచ బ్యాంక్ వైట్ హౌస్ వంటి ప్రఖ్యాత విశ్వా వేదికల మెట్లెక్కబోతున్నారు. సదస్సులో ఏపీలో అమలవుతున్న సంస్కరణ గురించి ప్రసంగించాలని ఏపీ విద్యార్థులకు ఆహ్వానం అందింది.
వైట్ హౌస్ సందర్శనకు ఆహ్వానం
ఏపీలో అమలవుతున్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, డిజిలటైజేషన్ వంటి విద్యా పథకాలకు సంబంధించిన వివరాలను ఈ సదస్సులో ఏపీ విద్యార్థులు వివరిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న ఏపీ విద్యార్థుల బృందానికి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ స్వాగతం పలికారు. ఇప్పటివరకు వైట్‌హౌస్ బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్ర మే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైట్‌హౌస్ లోపలి ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించారు.

17న కొలంబియా యూనివర్సిటీలో జరిగే గ్లోబల్ స్కూల్స్ సమ్మిట్‌లో రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై ప్రసంగిస్తారు. 20న జర్నలిస్ట్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో జరిగే ఎస్‌డీఎస్ సర్వీస్ సదస్సులో పాల్గొంటారు. 22న యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్‌లో జరిగే ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.
వరల్డ్ బ్యాంకులోనూ అవకాశం
25న ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉన్నత ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న 'నాడు-నేడు' కార్యక్రమంపై ప్రసంగిస్తారు. 26వ తేదీన అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్స్ ఆధ్వర్యంలో జరిగే బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్‌లో పాల్గొంటారు. 27వ తేదీన అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించి 28న భారత్‌కు బయలుదేరతారు.

ఎనిమిది మంది బాలికలు, ఇద్దరు బాలురతో కూడిన ప్రతినిధుల బృందాన్నిపూర్తి ప్రభుత్వ వ్యయంతోనే ఈ అమెరికాకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విధ్యార్దులకు దక్కిన ఈ అరుదైన గౌరవం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలోనే తొలి సారిగా ఏపీ ప్రభుత్వ బడుల్లో చదువుతన్న ఈ విద్యార్ధులకు దక్కిత ఈ అరుదైన అవకాశం పైన చర్చ సాగుతోంది. ఈ విద్యార్దులకు ప్రశంసలు లభిస్తున్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications