ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం - ముహూర్తం ఖరారు..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే రూ 4వేలకు పెన్షన్ పెంపు అమలు పైన ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కొనసాగింపుగా సూపర్ సిక్స్ లో మరో హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. ఈ పథకం అమలు పైన నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం.. అమలు కోసం ఒక ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.

మరో హామీ అమలు దిశగా
ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించింది. కొత్త అసెంబ్లీ కొలువు తీరింది. గత ప్రభుత్వ పథకాల పేర్లను మార్పు చేసింది. కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు మొదలైంది. పెన్షన్ రూ 4 వేల పెంపు, అన్నా క్యాంటీన్ల అమలు దిశగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..ఇతర హామీ లపై ఫోకస్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు సందర్శించిన చంద్రబాబు..అమరావతి నిర్మాణం పైన 24న జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

AP Govt Seek study reports over Implementation of Free bus for Women in the State

నివేదిక కోరిన ప్రభుత్వం
టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పై అడుగులు పడుతున్నాయి. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమల రావుకు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు. ఈ పథకం అమలును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో ఆర్టీసీ బాధ్యతలను డీజీపీ వద్దే కొనసాగిస్తోంది. ఇక..ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు పైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఆ రాష్ట్రాల్లో ఈ పథకం అమలు ద్వారా ఆర్దిక భారం, సమస్యలు, నిర్వహణా లోపాల పైన అధికారులు పూర్తి స్థాయి నివేదిక కోరారు.

అమలు ముహూర్తం
ఏపీలో ఈ పథకం అమలు చేయాలంటే కొత్త బస్సులు కావాలని ఆర్టీసీ యూనియన్లు ప్రభుత్వానికి నివేదించాయి. రోజు వారీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య, దూరం ఆధారంగా ప్రభుత్వం ఈ పథకం అమలుకు వీలుగా మార్డదర్శకాలను జారీ చేయనుంది. అయితే..పథకం ప్రారంభించిన తరువాత సమస్యలు రాకుండా ముందుగానే వాటి పైన ఒక అంచనాతో నిర్ణయాలు ఉండాలని భావిస్తోంది. ఇందు కోసం ఇప్పటికే ప్రభుత్వం వద్ద సిద్దంగా ఉన్న సమాచారం పరిశీలిస్తూ..అదనపు వివరాలు సేకరిస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+