జగన్ నిర్ణయాల పై వేట - అర్దరాత్రి కార్యాలయం సీజ్..!!

ఏపీలో ప్రభుత్వం మారటంతోనే కొత్త రాజకీయం మొదలైంది. ఈ నెల 12న చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనుంది. కేంద్రంలోనూ టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. చంద్రబాబు కేబినెట్ లో ఏపీలో టీడీపీ, జనసేన భాగస్వాములు అవుతున్నాయి. ఇక..జగన్ హయాంలో అయిదేళ్ల పాలనలో తాము చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ దిశగా టీడీపీ ముఖ్యులు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కార్యాలయం సీజ్
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రభుత్వం అర్ధరాత్రి సీజ్‌ చేసింది. గనుల శాఖ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) వైస్‌చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా జంట పోస్టుల్లో ఉన్న వెంకటరెడ్డిపై శుక్రవారం రాత్రే ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన డిప్యుటేషన్‌ కాలం మరో నెల వరకు ఉన్నా గనుల శాఖ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఏపీఎండీసీ ఆఫీసును పూర్తిగా పోలీసుల నియంత్రణలోకి తీసుకొచ్చింది. కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు పరిశీలన చేసి పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు.

గతంలో ఆరోపణలు
కార్యాలయంలో కీలకమైన ఫైళ్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఆఫీసు మూసేఉంటుందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు గనుల శాఖ డెరెక్టర్‌గా, ఎండీసీ ఎండీగా యువరాజ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీఐఐసీ భవనంలోని తన కార్యాలయంలో గనుల శాఖ అధికారుల సమక్షంలో చార్జ్‌ తీసుకున్నారు. ఆ సమయంలో వెంకటరెడ్డి లేకపోవడంతో జాయింట్‌ సంతకానికి బదులు యువరాజ్‌ ఒక్కరే సంతకం చేశారు. అనంతరం గనుల శాఖ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులు, కీలక అంశాలపై రెండు గంటలపాటు సమీక్ష చేశారు.

AP Govt Seize APMDS Office midnight in NTR Dist seek total reports over the past fice years decisions

విచారణ దిశగా
మరో వైపు ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాష్ట్ర పరిశ్రమల శాఖ లో ఇప్పటి వరకూ ఎండీగా వ్యవహరించిన ఎం.మధుసూదనరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌లో స్కాం జరిగిందంటూ జగన్‌ సర్కారు తప్పుడు కేసులు పెట్టి.. పలువురు మాజీ అధికారులను అరెస్టు చేయించడంతో పాటు చంద్రబాబుపైనా చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇప్పుడు ఆ తప్పుడు కేసుకు సంబంధించి కీలక ఫైళ్లతో పాటు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగించిన చీకటి వ్యవహారాల ఫైళ్లు కూడా మాయం చేశారన్న ఆరోపణలొచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+