ఇంటి వద్దకే రేషన్ పంపిణీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్దమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి తెచ్చిన రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నిలిపివేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించింది. అటు రేషన్ డీలర్లు ఇంటి కే రేషన్ సరఫరా చేసే వాహనాలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటు ఎండీయూ ఆపరేటర్స్ తమకు వచ్చే ఏడాది వరకు అవకాశం ఇవ్వాలని పట్టు బట్టుతున్నారు. దీంతో, ఈ నెల 20న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వాహనాలు ఏం చేద్దాం
వైసీపీ ప్రభుత్వ హాయంలో రేషన్ ను ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా వాహనాల ద్వారా డెలవరీ వ్యవస్థను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యవస్థ రద్దు చేయాలని భావించింది. ఇందులో భాగంగా పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో ఆ శాఖ ఉన్నతాధికారులు రేషన్‌ డీలర్ల సంఘాల ప్రతినిధులతోనూ, ఎండీయూ ఆపరేటర్స్‌ (ఎండీయూ ఆపరేటర్స్‌) సంఘ నాయకులతోనూ విడివిడిగా చర్చలు జరిపారు. రేషన్‌ సరుకుల పంపిణీ కోసం ఎండీయూ వాహనాలను కొనసాగించాలా.. వద్దా అనే అంశం పైన రెండు వైపులా అభిప్రాయ సేకరణ చేసారు. ఎండీయూ ఆపరేటర్లు, రేషన్‌ డీలర్లు భిన్నమైన అభిప్రా యాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.

AP govt to abolish Ration delivery vehicles in the state details here

భిన్న వాదనలు
ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని రేషన్‌ డీలర్లు ఆరోపిస్తున్నారు. వాహనాలను ఇప్పటికిప్పుడు నిలిపివేస్తే తామంతా వీధిన పడతామని ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పం దం 2027 జనవరితో ముగుస్తుందని, అప్పటి వరకు రేషన్‌ వాహనాలను కొనసాగిస్తే.. ఈలోగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూసుకుంటామని ఎండీయూ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని ఎండీయూ ఆపరేటర్లందరి ఏకాభిప్రాయంతో వారంలోగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని ఆపరేటర్ల ప్రతినిధులకు మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో, మరో విడత చర్చల తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+