TTD: టీటీడీ జేఈవోగా జైళ్ల శాఖ డీఐజీ..!!
Tirumala: తిరుమలలో కీలక నియామకాల పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈవోగా శ్యామలారావును ప్రభుత్వం నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. కాగా, ఇప్పుడు టీటీడీ జేఈవోగా జైళ్లశాఖలోని కోస్తాంధ్ర రేంజ్ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ నియమితులు కానున్నట్లు సమాచారం.
కీలక బాధ్యతలు
టీటీడీలో సంస్కరణ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. నూతన పాలక వర్గం కూర్పు పైన కసరత్తు చేస్తోంది. కొత్త ఛైర్మన్ గా ఇద్దరి పేర్లు రేసులో ఉన్నాయి. మీడియా సంస్థ అధినేతకు ఈ పదవి ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో పూర్తి స్థాయి బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో టీటీడీ జేఈవోగా జైళ్లశాఖలోని కోస్తాంధ్ర రేంజ్ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ నియమితులు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ఆ పోస్టు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేసుకోగా, ఈ మేరకు దస్త్రం సిద్ధమైంది.

తాజా నియామకాలు
టీటీడీ పరిధిలోని తిరుపతిలో ప్రస్తుతం జేఈవోలుగా వీరబ్రహ్మం, గౌతమి ఉన్నారు. వీరిలో వీరబ్రహ్మం స్థానంలో రవికిరణ్‌ను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు ఐఏఎస్‌లు, ఐఆర్‌ఎస్‌లు, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ వంటి అధికారులకే టీటీడీలో అవకాశం ఇస్తున్నారు. తాజాగా జైళ్లశాఖ అధికారిని డిప్యుటేషన్‌పై తీసుకొని, నియమించేలా అవకాశం కల్పించి, రవికిరణ్‌కు పోస్టింగ్ ఇస్తారని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక, అటు టీటీడీ తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు సిద్దం అవుతోంది.
టీటీడీ కసరత్తు
బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టిటిడి రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేలా సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. అక్టోబరు 3 (అంకురార్పణం) నుండి 12వ తేదీ (చక్రస్నానం) వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సం|| లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు టిటిడి రద్దు చేసింది.












Click it and Unblock the Notifications