Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం - 65 లక్షల మందికి లబ్ది..!!

ఏపీలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగా - పార్టీలోనూ వేగంగా అడుగులు వేస్తున్నారు. తన సంక్షేమమే తనకు తిరిగి అధికారం కట్టబెడుతుందని జగన్ విశ్వసిస్తున్నారు. 2019 లో ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తున్నారు. ఇటు పార్టీలోనూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు.

పెన్షన్ రూ 3 వేలకు పెంపు : ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అందులో భాగంగా కొత్త సంవత్సరం కానుకగా వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ 3 వేలకు పెంచుతూ ఈ రోజు జరిగే కేబినెట్ లో ఆమోదం తెలపనున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏటా రూ 250 చొప్పున పెంచుతూ పెన్షన్ మూడు వేలు చేస్తానని జగన్ హామ ఇచ్చారు. అదే విధంగా అమలు చేసారు. ప్రస్తుతం రూ 2,750గా ఉన్న పెన్షన్ వచ్చే నెల నుంచి రూ 3,000గా ఇవ్వనున్నారు. దీని ద్వారా దాదాపు 65 లక్షల మంది అవ్వా,తాతలకు లబ్ది జరగనుంది. కొద్ది రోజులుగా జగనన్న సురక్ష ద్వారా అర్హత ఉండి పధకాలు అందని వారిని..గతంలో పథకం పొంది మధ్యలో నిలిచిపోయిన వారిని ప్రభుత్వం గుర్తించింది. అందులో అర్హులైన వారికి తిరిగి పథకం అమలు చేస్తోంది. ఇక, ఈ నిర్ణయం ద్వారా జగన్ ఇచ్చిన మరో హామీ ఎన్నికల వేళ అమల్లోకి రానుంది.

AP Govt to hike the old age pension to Rs 3,000 from January 1, 2024

కేబినెట్ భేటీలో నిర్ణయాలు : ఇక, రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాను ధాటికి భారీ నష్టం చోటు చేసుకుంది. లక్షలాది ఎకరాల పంటలు దెబ్బ తిన్నాయి. మరికొన్ని ఇల్లు కూడా నేలమట్టమయ్యాయి. నష్ట పరిహారం పైన క్షేత్ర స్థాయి నుంచి ప్రాధమిక సమాచారం సేకరించారు. ప్రస్తుత కేబినెట్ భేటీలో రైతులకు తక్షణ సాయం..ఎకరాకు ఎంత మేర చెల్లించాలనే అంశం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ నెల చివర్లో విశాఖ నుంచి పాలన సీఎం జగన్ పాలన ప్రారంభించాలని భావిస్తున్నారు. దీని పైన కేబినెట్ లో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక..వైఎస్సార్ చేయూత..వైఎస్సార్ ఆసరా వంటి పథకాలు అమలు తేదీలను మంత్రివర్గంలో ఖరారు చేయనున్నారు. ఇప్పటికే జనవరిలో వీటిని విడుదల చేస్తామని జగన్ ప్రకటించారు.

AP Govt to hike the old age pension to Rs 3,000 from January 1, 2024

మంత్రులకు దిశా నిర్దేశం : ఇక పాలనా పరంగా తీసుకోవాల్సిన పలు నిర్ణయాలను చర్చించనున్నారు. ఎన్నికల సమయం రావటంతో మంత్రులు పాలనా వ్యవహారాలతో పాటుగా పార్టీ అంశాల పైన ఫోకస్ చేయాలని సీఎం జగన్ దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఇంఛార్జ్ ల మార్పులో భాగంగా ముగ్గురు మంత్రులకు స్థాన చలనం కలిగింది. ఇంఛార్జ్ ల మార్పు..ఎన్నికల వేళ ఎటువంటి కార్యాచరణ అమలు చేయాలనే అంశాల పైన సీఎం జగన్ మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కల్పన పైన మంత్రివర్గంలో చర్చిస్తారని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి తనతో సహా మంత్రులు..పార్టీ నేతలు ప్రజల్లోనే ఉండేలా సీఎం జగన్ ఈ రోజు కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+