SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు బిగ్ అప్డేట్..ఈ సారి కొత్తగా..!!
ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. మార్చి 16వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 1వ తేదీ నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం కానుంది. కాగా, ఈ సారి పదో తరగతి పరీక్ష రాసే విద్యార్ధుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాల ఏర్పాటు. .అక్కడ పరీక్షకు వెళ్లే విద్యార్ధులకు ఎక్కడా అసౌకర్యం లేకుండా కొత్త విధానం అమల్లోకి తెస్తున్నారు.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది కొత్తగా హాల్‌టికెట్ల వెనుక భాగంలో పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్‌ను ముద్రించనున్నారు. అందులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్ వస్తుంది. దీని ద్వారా విద్యార్ధులు తాము వెళ్లాల్సిన పరీక్షా కేంద్రాల వివరాలు... చిరునామా గురించి ఎలాంటి సందేహాలు లేకుండా ఈ విధానం అమల్లోకి తెస్తున్నారు. అదే సమయంలో పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే చీఫ్ సూపరింటెం డెంట్, ఇన్విజిలేటర్లను ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేస్తారు.

ఇదే సమయంలో పదో తరగతి విద్యార్థులెవరినీ డ్రాప్ బాక్సులో పెట్టకూడదని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో పది ఫలితాల్లో వెనుకబడిన 100 పాఠశాలలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. పదో తరగతి పరీక్షలు రాసే అభ్యర్థులందరికి తప్పనిసరిగా అపార్ ఐడీ ఉండాలని స్పష్టం చేసింది. ఇక.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24 నుంచి ద్వితీయ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని తెలిపింది.












Click it and Unblock the Notifications