'భారతి' కి ప్రభుత్వం భారీ షాక్ - ఉక్కిరి బిక్కిరి..!?

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసు కుంటోంది. ఎన్నికల నాటికి.. ఇప్పటికి రాష్ట్రంలో సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీ లక్ష్యం గా కూటమి ప్రభుత్వం వ్యూహాలు అమలు చేస్తోంది. ఇటు ప్రభుత్వం పైన జగన్ పోరుబాటకు సిద్దం అయ్యారు. తాజాగా సాక్షి ఛానల్ వేదికగా అమరావతి మహిళల పైన జర్నలిస్టు క్రిష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి. ఈ కేసులో అరెస్టులు మొదలయ్యాయి. కాగా, జగన్ - భారతి క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

కీలక పరిణామాలు
మాజీ సీఎం జగన్ తో పాటుగా ఆయన సతీమణి రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు. భారతి నిర్వ హిస్తున్న సాక్షి ఛానల్ లో జరిగిన చర్చ.. జర్నలిస్టు క్రిష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాస రావును అరెస్ట్ చేసారు. క్రిష్ణంరాజు పరారీ లో రు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన పైన జగన్ - భారతి లక్ష్యంగా రాజకీయ ఆరోపణలు మొదలయ్యాయి. ఈ ఇద్దరు క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. కాగా, ఇప్పుడు భారతి సిమెంట్స్ విషయంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా భారతి సిమెంట్‌కు కేటాయించిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్ధమవుతోంది.

ap-govt-to-take-key-decision-on-bharti-cement-over-violation-of-lease-rules

లీజులపై నిర్ణయం
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా భారతి సిమెంట్స్ కు సున్నపు రాతి గనులు లీజుకు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. వేలం విధానంలో లీజులు పొందాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పాత దరఖాస్తులతో గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్దిరోజుల ముందు మొత్తం 744 ఎకరాల్లో రెండు సున్నపురాతి గనులను జగన్ ప్రభుత్వం భారతి సిమెంట్‌కు కేటా చింది. వీటిపై కేంద్ర గనులశాఖ వివరణ కోరడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధ ది. న్యాయ విభాగం కూడా లీజుల రద్దుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో గనులశాఖపై ఈ రోజు ద్రబాబు నిర్వహించే సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, వైఎస్ హయాంలో 2009లో రఘురామ్ సిమెంట్‌ను భారతి సిమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది.

రద్దుకు సిఫారసు
రఘురామ్ పేరిట 744 ఎకరాల్లో ఉన్న రెండు సున్నపు రాయి లీజులు తమకు కేటాయించాలని దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు అప్పట్లో ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్(LOI) మంజూరు చేసింది. LOI ఇచ్చాక అన్ని అనుమతులు తెచ్చుకుంటేనే లీజు మంజూరు చేస్తారు. అయితే ఆ కంపెనీ అనుమతులు పొందలేకపోయింది. ఆ తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ హయాంలో ఇచ్చిన భారతి సిమెంట్ లీజులను రద్దు చేయవచ్చంటూ న్యాయ విభాగం ఇటీవల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏసీసీ, రామ్‌కో సిమెంట్‌కు సంబంధించిన లీజులపై ఇంకా అభిప్రాయం వెల్లడించలేదు. ఈ క్రమంలో తొలుత భారతి సిమెంట్ లీజులను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+