మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు నోటీసులు- వైఎస్ అవినాష్ మామకూ

అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రానైట్‌ తవ్వకాలకు సంబంధించిన ఎన్‌ఓసీని జారీ చేయడంలో నిబంధనల ఉల్లంఘించిన కారణంగా ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్‌ రెడ్డికీ హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. స్థానిక తహశీల్దార్‌కు కూడా న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

ఎన్టీఆర్‌ జిల్లా మెురకపూడిలోని 91 ఎకరాల అసైన్డ్ భూమిలో గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంలో మంత్రి విడదల రజిని నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎన్ఓసీని జారీ చేయడం వెనుక మంత్రి హస్తం ఉందంటూ ఇదివరకు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇవ్వాళ విచారణ చేపట్టింది. పిటీషన్ తరఫు న్యాయవాది వాదనలను ఆలకించింది.

 AP High Court issues notices to Medical and health Minister Vidadala Rajini in mining case

అనంతరం ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందంటూ విడదల రజినికి నోటీసులను జారీ చేసింది. మంత్రితో పాటు స్థానిక మెరకపూడి తహసీల్దార్‌, సీఐ, ఎస్ఐకు కూడా నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. ఈ మూడు వారాల్లోగా ఏపీ హైకోర్టుకు విడదల రజిని వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అసైన్డ్ భూములను సాగు చేసుకుంటోన్న రైతుల నుంచి చట్టవిరుద్ధంగా మైనింగ్‌కు ఎన్ఓసీ ఇచ్చారనే ఆరోపణలకు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+