చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు కీలక ఆదేశాలు- స్వల్ప ఊరట..!!

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ల పైన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు..అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ప్రస్తుతం స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును విచారించేందుకు ఇప్పటికే సీఐడీ ఈ కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసింది. వీటి పైన ముందుకు వెళ్లకుండా హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.

హైకోర్టులో స్వల్ప ఊరట : చంద్రబాబు హైకోర్టులో స్వల్ప ఊరల లభించింది. స్కిల్ కేసులో చంద్రబాబు 32 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. సుప్రీంలో ఈ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ తదుపరి విచారణ ఈ నెల 13న జరగనుంది. ఈ సమయంలో చంద్రబాబును అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసుల్లో అరెస్ట్ చేకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ముందుగా ఈ పిటీషన్లపై చంద్రబాబు తరపు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది .తిరిగి రెగ్యులర్ కోర్టులో పిటీషన్లు దాఖలు చేయగా..ఈ రోజు విచారణ జరిగింది. పూర్తి స్థాయి విచారణకు సమయం ఇవ్వాలని..ముందుగా మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.

AP High court Key orders on Chandra Babu Bail petitions in IRR and Angallu Cases

సోమవారం వరకు బెయిల్ : అయితే, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఈ సమయంలో బెయిల్ ఇవ్వటం సరి కాదని వాదించారు. రెండు పక్షాల వాదనల తరువాత హైకోర్టు పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉన్న అంగళ్లు కేసులో రేపటి వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సోమవారం వరకు అరెస్ట్ చేకుండా ఊరట ఇచ్చింది. అయితే, ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే సీఐడీ ఏసీబీ కోర్టులో సీటీ వారెంట్ దాఖలు చేసింది. దీని పైన ఈ మధ్నాహ్నం లేదా రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. అంగళ్లు కేసులోనూ రేపటి వరకే కోర్టు అరెస్ట్ చేయకుండా మినహాయింపు ఇచ్చింది. అయితే, స్కిల్ కేసులో క్వాష్ పిటీషన్ తమకు అనుకూలంగా వస్తుందనే నమ్మకంతో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ సమయంలో ఇతర కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.

పీటీ వారెంట్ పై విచారణ : ఇక, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది. శుక్రవారం సుప్రీంలో క్వాష్ పిటీషన్ పైన విచారణ ఉండటంతో ఏం జరుగుతుందనేది కీలకంగా మారుతోంది. ఇటు ఏసీబీ కోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. దీని పైన సుప్రీంలో వచ్చే నిర్ణయానికి అనుగుణంగా చంద్రబాబు న్యాయవాదులు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఏసీబీ కోర్టులో ఫైబర్ గ్రిడ్ పీటీ వారెంట్ విచారణ పైనా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+