అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎస్ జవహర్ రెడ్డి - ప్రవీణ్ ప్రకాశ్ కు హైకోర్టు కీలక ఆదేశాలు..!!

కోర్టు ధిక్కరణ కేసులో కోర్టు ముందు హాజరు కావాలని సీఎస్, ప్రవీణ్ ప్రకాశ్ కు హైకోర్టు ఆదేశం.

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి..విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కోర్టుకు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అనంతపురం కదిరికి చెందిన ఒప్పంద అధ్యాపకులు 114 మంది తో కలిసి హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేసారు. అందులో శాశ్వత అధ్యాపకుల మాదిరి తమకు ఆర్దిక ప్రయోజనాలను కల్పించాలని కోర్టును కోరారు.

ఎయిడెడ్ అధ్యపకులను తాము పని చేసే కశాశాలలో విలీనం చేసుకున్నా సీనియార్టీకి అవరోధం కల్పిచవద్దని తమ పిటీషన్ లో అభ్యర్ధించారు. తమ స్థానాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం పైన గత సెప్టెంబర్ లో న్యాయమూర్తి రాజశేఖర రావు విచారించారు.

AP High court ordered CS and Praveen Prakash to Attend the Court in contempt case

ప్రభుత్వ న్యాయవాది విచారణకు హాజరు కాకపోవటంపైన అసహనం వ్యక్తం చేసారు. ఆ వ్యాజ్యం అప్పటికే మూడు సార్లు వాయిదా పడిన అంశాన్ని ప్రస్తావించారు. పిటీషనర్లు అభ్యర్ధించిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆ ఉత్త్వర్వులు అమలు చేయకపోవటంతో తిరిగి ఉమాదేవి హైకోర్టు లె కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు.

AP High court ordered CS and Praveen Prakash to Attend the Court in contempt case

అందులో సీఎస్ జవహర్ రెడ్డి, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ శేషగిరి బాబులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. న్యాయస్థానం నోటీసులు ఇచ్చినా జవహర్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాశ్ తరపున ఎవరూ హాజరు కాకపోవటంపై న్యాయమూరి వారికి నోటీసులు జారీ చేసారు.

English summary
AP High Court ordered CS Jawahar Reddy and Paraveen Prakash to attend before the court .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X