ఏపీలో ఇక హెల్మెట్ తప్పనిసరి - హైకోర్టు ఆదేశాలు..!!

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. మోటారు వాహన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి రూల్స్ ఎలా అమలవుతున్నాయో కౌంటర్ దాఖలు చేయాలని కూడా సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో, ద్విచక్ర వాహణ దారులు హెల్మెట్ వినియోగం తప్పనిసరి కానుంది.

అమలు చేయాల్సిందే
మోటారు వాహన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా హెల్మెట్‌ ధరించి వాహనాలు నడిపే రూల్‌ను అమలు చేయాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. రోడ్డు ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో చట్టనిబంధనలు కఠినంగా అమలుచేయాలని ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల సంభవించే దుష్ప్రభావాలు, చట్టనిబంధనల గురించి అధికారులతో కలసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏపీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని ఆదేశించింది.

AP High Court Orders for Govt to make Mandatory to wear helmets across the state

ప్రభుత్వానికి ఆదేశం
రోడ్లపై విధులు, వాహన తనిఖీలు నిర్వహించే పోలీసు అధికారులు తప్పనిసరిగా బాడీ కెమెరాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చట్టనిబంధనలు ఉల్లంఘించేవారిని ఎంతమాత్రం ఉపేక్షించవద్దని, విస్తృత ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియ్‌సగా తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర మోటార్‌ వెహికిల్‌ సవరణ చట్టం అమలుకు ఏం చర్యలు తీసుకున్నారు? వాహనాలు తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించినవారికి చలాన్‌ల విధింపు, తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కఠినంగా ఉండాలి
కేంద్ర మోటార్‌ వాహన సవరణ చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధించడంలేదని పేర్కొంటూ యోగేశ్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం వాహనదారులు, వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... విజయవాడలో వాహనదారులు హెల్మెట్‌ ధరించకుండా తిరగడాన్ని తామూ గమనించామని, విస్తృత ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టనిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+