సీబీఐకు స్కిల్ కేసు - హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టత..!!

చంద్రబాబు రిమాండ్ కు కారణమైన స్కిల్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి ఈ కేసును సీబీఐకు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సీబీఐ విచారణకు ఇవ్వటానికి అభ్యంతరం లేదని ఏజీ కోర్టుకు స్పష్టం చేసారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసారు.

హైకోర్టులో కీలక పరిణామం : స్కిల్ స్కాం కేసులో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు సుప్రీంలో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ విచారణలో ఉంది. ఈ సమయంలో హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ ఈ నెల 17న విచారణకు రానుంది.

AP High Court posted Undavalli Petition on seek CBI probe in Skill Sacm posted for four weeks

ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసారు. స్కిల్‌ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి కోరారు. ఈ కేసులో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణ ప్రత్యేక విచారణ టీంను ఏర్పాటు చేసామని ఏజీ కోర్టుకు నివేదించారు.

అభ్యంతరం లేదన్న ప్రభుత్వం : ఈ కేసుకు సంబంధించి సీబీఐకు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఏజీ కోర్టుకు వివరించారు. స్కిల్‌ కేసు సీబీఐ విచారణకు ఇవ్వడానికి తమకు అభ్యంతర లేదని ఏజీ శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు. దీంతో, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో సహా 44 మందికి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

AP High Court posted Undavalli Petition on seek CBI probe in Skill Sacm posted for four weeks

స్కిల్‌ స్కాం విచారణ సీఐడీ నుంచి..సీబీఐ విచారణకు ఇవ్వాలని రిట్‌ పిటిషన్‌ లో ఉండవల్లి కోరారు. ఈ కేసు వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉందని ఉండవల్లి వివరించారు. లోతైన విచారణ అవసరమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ, ఏపీ ప్రభుత్వంతోపాటు స్కిల్‌ స్కాం నిందితులందరినీ ఉండవల్లి తన పిటీషనల్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ : ప్రస్తుతం సీఐడీ చేస్తున్న ఈ విచారణ విషయంలో కోర్టు తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది. ఏపీ ప్రభుత్వం సైతం ఈ కేసును సీబీఐకు ఇవ్వటం తమకు అభ్యంతరం లేదని చెప్పటంతో... నోటీసులకు 44 మంది సమాధానాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అటు స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ రిపోర్టు..అరెస్ట్..17ఏ పైన సుప్రీంలో క్వాష్ పిటీషన్ విచారణ సాగుతోంది. ఈ రోజు విచారణ తరువాత కోర్టు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే ఇటు హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటీషన్ లో నోటీసులు జారీ కావటంతో..స్కిల్ కేసులో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+