వాలంటీర్లకు ఆ అధికారం ఎక్కడిది - హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

వాలంటీర్ల విధుల విషయంలో తాము కోరిన వివరాలను సెర్ఫ్ సీఈవో కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు ఆక్షేపించింది.

సంక్షేమ పధకాల లబ్దిదారుల ఎంపికలో వాలంటీర్ల విధుల పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. వాలంటీర్ల విధుల విషయంలో తాము కోరిన వివరాలను సెర్ఫ్ సీఈవో కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు ఆక్షేపించింది. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలు ఎలా సేకరిస్తారని ప్రశ్నించింది. అందుకు ఏ చట్ట నిబంధనలు అనుమతిస్తున్నాయో స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. వైఎస్సార్ చేయూత పథకం కింద లబ్దిదారుల జాబితా నుంచి రాజకీయ కారణాలతో తొలిగించటం పైన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా వాలంటీర్ల వ్యవస్థ పైన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

పథకాల అమలు..వాలంటీర్ల పాత్ర పైన హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. పలు సందేహాలు వ్యక్తం చేసింది. వైఎస్సార్ చేయూత పథకం కింద గతంలో లబ్దిదారులుగా ప్రయోజనం పొందామని..రాజకీయ కారణాలతో తమను అర్హుల జాబితా నుంచి తొలిగించారని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన వసంతలక్ష్మితో సహా 26 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు వారి విధుల పై స్పష్టత ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సెర్ప్ సీఈవోను ఆదేశించారు. దీనికి అనుగుణంగా సీఈవో అఫిడివిట్ దాఖలు చేసారు. దీని పైన సెర్ప్ సీఈవో తరపు న్యాయవాది తమ వాదనల్లో భాగంగా.. వాలంటీర్లు సమాచారాన్ని సేకరించి సచివాలయ సిబ్బందికి ఇస్తారని..లబ్దిదారుల ఎంపికలో వారి పాత్ర ఉండదని చెప్పారు. సీఈవో వేసిన అఫిడవిట్ పైన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేసారు. మెరుగైన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు.

AP High Court seek more information on the role of village volunteers, directed the SERP CEO to file an affidavit

కేసు విచారణలో భాగంగా గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధులు నిర్వహించే వారని గుర్తు చేసారు. వాలంటీర్లకు జవాబుదారీ తనం ఏమి ఉంటుందని ప్రశ్నించింది. గతంలోనూ ఈ కేసు విచారణ సమయంలో వాలంటీర్ల పాత్ర పైన కోర్టు స్పష్టత కోరింది. వాలంటీర్లు కీలక సమాచారం సేకరణపైనా ప్రశ్నలు సందించింది. వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని.. నిబంధనలు అనుమతిస్తే వారిని శాశ్వత ఉద్యోగులు గా గుర్తించే అవకాశం పరిశీలించాలని సూచించింది. పథకాల అమలు..లబ్దిదారుల ఎంపికలో వాలంటీర్ల పాత్ర పైన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కానీ, దాఖలైన తాజా అఫిడవిట్ లో సమగ్ర సమాచారం లేదని..మరోసారి దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+