వ్యాపారం మూసుకోవాల్సి వస్తుంది- ట్విట్టర్ పై ఏపీ హైకోర్టు సీరియస్ : జడ్జిలపై పోస్టుల కేసులో..!!

ప్రఖ్యాత సోషల్ మీడియా ప్లాట్ ఫాంగా ఉన్న ట్విట్టర్ పైన ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచార‌ణ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భారతదేశంలోని చట్టాలు, న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ట్విటర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచార‌ణ సంద‌ర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ట్విట్టర్‌లో పోస్టులు డిలీట్ చేసినా.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే ఆ పోస్టులు వస్తున్నాయని హైకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ట్విట్టర్ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియ‌ల్‌ను స్వాధీనం చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. హెచ్చ‌రించింది.. న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన విదేశాల్లో ఉన్న వారిని ఎప్పటిలోగా అరెస్టు చేస్తారని ఈ సంద‌ర్భంగా సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు.. వచ్చే వారంలో కౌంటర్ వేయాలని ఆదేశించింది.

AP high Court serious on twitter regarding comments on judges in social media platforms

Recommended Video

    High Court Advocate On Bandi Sanjay Case.. అన్నీ తప్పుడు కేసులే | Oneindia Telugu

    వచ్చే సోమవారానికి కేసు విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తుల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వారి పైన సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే అందులో బాధ్యులైన వారిని సీబీఐ అరెస్ట్ చేసింది. కోర్టులో ప్రవేశ పెట్టింది. కొద్ది రోజుల క్రితమే వారికి కండీషన్లతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఇక, ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో ఆ వ్యాఖ్యల అంశం పైన న్యాయవాది కోర్టుకు నివేదించటం తో న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+