స్టూడెంట్స్.. బీ అలర్ట్: ఏపీలో ఇంటర్ పరీక్షల తేదీలొచ్చేశాయ్- కంప్లీట్ షెడ్యూల్ ఇదే
అమరావతి: ఏపీలో పరీక్షల కోలాహలం మొదలైంది. ఇన్ని రోజుల పాటు పుస్తకాలతో కుస్తీ పడిన లక్షలాది మంది విద్యార్థులు ఇక ఫైనల్ ఎగ్జామ్స్ కోసం మరింత రాటుదేలాల్సి వస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు ఈ పరీక్షల టైమ్ టేబుల్ ను విడుదల చేశారు. వొకేషనల్ కోర్సు పరీక్షలు కూడా దీనితో పాటే ఉంటాయని పేర్కొన్నారు.
మార్చి 15వ తేదీన బుధవారం ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పరీక్షలు మొదలవుతాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు కొనసాగుతాయి. మార్చి 16వ తేదీన గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఆరంభమౌతాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ రెండింటి పరీక్షలు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.

మార్చి 15వ తేదీన- పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, 17వ తేదీన- పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష ఉంటుంది. 20వ తేదీన పార్ట్ 3లో మేథమేటిక్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 ఉంటుంది. 23వ తేదీన- మేథమేటిక్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్ 1 హిస్టరీపేపర్ 1 షెడ్యూల్ అయింది. 25వ తేదీన ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1, 28వ తేదీన కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలు ఉంటాయి.
మార్చి 31వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు, బైపీసీ స్టూడెంట్స్ కోసం మేథమేటిక్స్ పేపర్ 1 పరీక్షలు షెడ్యూల్ అయ్యాయి. ఏప్రిల్ 3వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీతో ఇంటర్ తొలి సంవత్సరం పరీక్షలు ముగుస్తాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షతో ఆరంభమౌతాయి. 18వ తేదీన ఇంగ్లీష్, 21వ తేదీన మేథమేటిక్స్ పేపర్ 2ఏ, బోటనీ, సివిక్స్ పరీక్షలు ఉంటాయి.
మార్చి 24వ తేదీన మేథమేటిక్స్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ, 27వ తేదీన ఫిజిక్స్, ఎకనామిక్స్, 29వ తేదీన కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2, ఏప్రిల్ 1వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు, బైపీసీ స్టూడెంట్స్ కోసం మేథమేటిక్స్ పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 4వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీతో ఈ పరీక్షలు ముగుస్తాయి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications