Inter Memo's: ఆన్‍లైన్‍లో ఇంటర్ మెమోలు.. ఇలా డౌన్‍లోడ్ చేసుకోండి..
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మెమోలను అందిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్ https://bieap.apcfss.in/ ద్వారా కలర్ మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. మెమోలను ఇప్పటికే ఆన్ లైన్ లో ఉంచినట్లు తెలిపింది. ఈ మెమోలతో ఉన్నత తరగతుల్లో ప్రవేశం పొందవచ్చని వివరించింది. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలైన రోజున మార్కుల లిస్ట్ మాత్రమే ఆన్ లైన్ లో ఉంచారు.
ఇప్పుడు మెమోలను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లగానే.. స్టూడెంట్స్, కాలేజీలు అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. మీరు స్టూడెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అని కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, మెయిల్ ఐడీ నమోదు చేసి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మెమోలో ఏమైన తప్పులు దొర్లితే సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్ల ద్వారా ఇంటర్ బోర్డ్ కు ఫిర్యాదు చేసి సరిచేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఏపీలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఫస్ట్ ఇయర్ లో 484197 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. అలాగే రెండో సంవత్సరంలో 519793 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 26న మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో కూడా 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 58%, బాలికలు 65 % ఉత్తీర్ణత సాధించగా.. ఇంటర్ సెకండియర్ లో బాలురు 68% , బాలికలు 75% ఉత్తీర్ణత సాధించారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications