ఏపీ ఇంటర్ పరీక్ష: జూన్ 3న నిర్వహణ, మాస్క్ కంపల్సరీ అంటోన్న ఇంటర్ బోర్డు
కరోనా వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 23వ తేదీన నిర్వహించాల్సిన మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలను బోర్డు పోస్ట్ పోన్ చేసింది. ఆ పరీక్షల నిర్వహణకు బోర్డు తేదీని ప్రకటించింది. జూన్ 3వ తేదీన పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని తెలిపింది.

ఇదివరకు జారీచేసిన హాల్ టికెట్లను తీసుకొని పరీక్షకు హాజరుకావాలని సూచించింది. హాల్ టికెట్లు పోతే.. bie.ap.gov.inలో డౌన్ లోడ్ చేసుకోవాలని కోరింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు విధిగా మాస్క్ ధరించాలని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. పరీక్ష కేంద్రం వద్ద భౌతిక దూరం పాటిస్తామని... శానిటైజర్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది.












Click it and Unblock the Notifications