AP Intermediate : ఏపీలో ఈ నెల 12 నుంచి ఇంటర్ కాలేజీల పునఃప్రారంభం

ఏపీలో కరోనా కారణంగా మూతపడిన ఇంటర్ మీడియట్ కాలేజీలను ఈ నెల 12న పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా విద్యార్ధులకు క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం కాలేజీలకు, అధికారులకు ఆదేశాలు పంపింది.

ఏపీలో ఇంటర్‌ కళాశాలలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆరోజున కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అంతా విధులకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. 12వ తేదీ నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్దేశించింది. సెకండియర్‌కు మొత్తం 213 రోజుల పనిదినాలు ఉండేలా అకడమిక్‌ క్యాలెండర్‌ను విద్యాశాఖ విడుదల చేసింది.

AP intermediate colleges to reopen on june 12, online classes for second year

Recommended Video

    Dr. Lasya Sai Sindhu, ENT and neurologist, said that doctors work hard to save the lives of patients

    ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది మార్చి 23 వరకు ఇంటర్ మీడియట్ విద్యార్ధులకు క్లాసులు జరుగుతాయి. మధ్యలో అక్టోబరు 1 నుంచి 8వ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, అలాగే యూనిట్‌ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తారు. తద్వారా విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూనే పాఠశాలలకు అధ్యాపకులు, ఇతర సిబ్బంది పనిచేసేలా ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చింది. మొదటి సంవత్సరం అడ్మిషన్లు కూడా త్వరలో ప్రారంభించనున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+