ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్..
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 1,35,826 మంది, ద్వితీయ సంవత్సరానికి 97,963 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ఈ పరీక్షలను నిర్వహించింది.
ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బోర్డు ఒకేసారి విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసేందుకు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫలితాలను చూసుకోవచ్చు.

అంతే కాకుండా ఈ ఏడాది 'మన మిత్ర' (వాట్సాప్) ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై Intermediate Supplementary Results పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు.












Click it and Unblock the Notifications