జపాన్ సంస్థ కుమి ఉమి ప్రతినిధులతో లోకేశ్ భేటీ...అమరావతిలో పెట్టుబడుల విషయమై వివరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామ కృషి కి ఆయన కుమారుడు,ఐటి మంత్రి లోకేష్ తన వంతు చేయూత అందిస్తున్నారు. అమరావతి లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన జపాన్ సంస్థలకు ఆయన ఇక్కడ పెట్టుబడుల వల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరించారు.
అమరావతిలో పెట్టుబడులు పెట్టే విషయమై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన జపాన్ సంస్థ కుని ఉమి ఎస్పెట్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ ఈరోజు భేటీ అయ్యారు.

జపాన్ పెట్టుబడులు...
సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఒక చోట నుంచి మరో చోటుకు తరలించగలిగే పెవిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం, ఐటీ స్పేస్ నిర్మాణం, నెస్ట్స్ జనరేషన్ ఆటో ఎలెక్టిక్ వెహికిల్ మోడల్ సిటీ నిర్మాణం తదిదర ప్రాజెక్టుల నిర్మాణానికి జపాన్ కుమి ఉమి సంస్థ ముందుకొచ్చినట్లు సమాచారం.

అమరావతి...రెండో టోక్యో....
ఈ సందర్భంగా ఐటి మంత్రి నారా లోకేష్ కుమి ఉమి ప్రతినిధులతో మాట్లాడుతూ ఎపి సిఎం చంద్రబాబు మదిలోని ఆలోచనలను వారితో పంచుకున్నారు. అమరావతిని రెండో టోక్యో చెయ్యాలనేది చంద్రబాబు ఆకాంక్షగా వారికి వివరించారు. ఆధునాతన వసతులు, మౌలిక సదుపాయాలతో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని లోకేశ్ వారికి తెలిపారు. గృహ సదుపాయంతో కూడిన ఐటీ పార్కుల అభివృద్ధి కోసం ఐఐటీ పాలసీ తీసుకొచ్చామని జపాన్ ప్రతినిధులకు తెలియజేశారు.

మరిన్ని అవకాశాలు...
విశాఖపట్నం, అనంతపురంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని లోకేష్ జపాన్ కంపెనీ ప్రతినిధులతో చెప్పారు. అమరావతిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు త్వరలోనే ఈవి పాలసీ తీసుకురాబోతున్న విషయం వారికి తెలియజేశారు.

జపాన్ కు ఆహ్వానం...
ఇక్కడి పరిస్థితులపై తమకు అవగాహన వచ్చిందని,
త్వరలోనే పూర్తి స్థాయి
ప్రతిపాదనలతో మీ ముందుకు వస్తామని జపాన్ సంస్థ ప్రతినిధులు లోకేష్ తో చెప్పారు.
నెక్స్ట్ జనరేషన్ ఆటో ఎలెక్ట్రిక్ వెహికల్ మోడల్ సిటీ ఏర్పాటు కోసం జపాన్ లో స్టేక్ హోల్డర్స్ తో సమావేశం ఏర్పాటు చెయ్యబోతున్నామని, ఆ సమావేశానికి హాజరు కావడానికి లోకేష్ ను కూడా జపాన్ కు రావాలని ఆహ్వానం పలికారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications