అపవాదులు సరికాదు, ప్రశ్నిస్తే రాజకీయమా - మా కార్యాచరణ ఆగదు..!!
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఉద్యోగ సంఘాల భేటీ లో బొప్పరాజు చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు వ్యాఖ్యల వీడియో ప్రజెంటేషన్ పైన విమర్శలు వచ్చాయి. మంత్రి అనగానితో పాటుగా మరో ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అనే సందేహం వ్యక్తం చేసారు. ఈ కామెంట్స్ కు తాజా గా బొప్పరాజు స్పష్టత ఇచ్చారు.
ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆ సమయంలో చంద్రబాబు గతంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ.. చేసిన ప్రసంగం విజువల్స్ ప్రదర్శించారు. దీంతో... మంత్రి అనగానితో పాటుగా, మరో ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. దీనికి స్పందిస్తూ బొప్పరాజు..
ప్రభుత్వ హామీల అమలు కోసం ఎదురుచూశామని చెప్పారు. మాకు రాజకీయ అజెండా లేదు.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లే మా ఎజెండా అని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని.. గత నెల లో ఐదుగురు మంత్రులు, 10 మంది సీఎస్ స్థాయి అధికారులతో చర్చలు జరిగాయని గుర్తు చేసారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా మని ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. చర్చలు జరిగి 40 రోజులు అవుతున్నా.. ఒక్క నిర్ణయం కూడా వెలువడలేదని వ్యాఖ్యానించారు.

ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది
అదే విధంగా ఆగస్టు 2లోగా నిర్ణయాలు చెప్పాలని కోరాం.. స్పందన లేదని చెప్పారు. ఆగస్టు 15లోగా నిర్ణయాలు వస్తాయని ఎదురుచూశామని.. ఫలితం లేదన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు గడువు ఇచ్చినా నిర్ణయాలు తీసుకోలేదని వివరించారు. ఉద్యమానికి వెళ్లక తప్పని పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కాదని స్పష్టం చేసారు. మా ఉద్యమ కార్యాచరణ పక్కదారి పట్టదని.. సమంజస మైన డిమాండ్లపై వెనక్కి తగ్గమని తేల్చి చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు జరిపాం.. నిర్ణయాలు ఎందుకు వెలువరించడం లేదనే అడుగుతున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలోనూ లక్షలాది ఉద్యోగులతో ఉద్యమాలు చేశామని.. అది ఏ రాజకీయ అజెండా తో అని అనుకుంటు న్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే ముఖ్యమంత్రిని అవమానించినట్టా? అని డొప్పరాజు ప్రశ్నించారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.. మమ్మల్ని శత్రువులుగా చూడొద్దని కోరారు. ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications