AP Job Calendar 2026: నిరుద్యోగులకు శుభవార్త.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్..

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 10,060 ఖాళీల భర్తీ లక్ష్యంగా నూతన జాబ్ క్యాలెండర్‌ ను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 4 దశల్లో వీటిని భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఉన్నత విద్యాశాఖలో ఇప్పటికే 1,500 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. మరో 3,231 పోస్టులకు సెప్టెంబర్ 15న.. అలాగే 2,311 ఉద్యోగాలకు అక్టోబర్ 15న, ఇక మరో 2,995 జాబ్స్‌ కు అదే రోజున నోటిఫికేషన్లు రానున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఈ క్యాలెండర్‌ కు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా నిలవనుంది.

ప్రభుత్వ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ లో గ్రూప్-1 లో 149 పోస్టులున్నాయి. ఇక గ్రూప్-1 కాకుండా ఇతర ఉన్నత శాఖల్లో 3,082 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే గ్రూప్-2 లో 673, ఇంజినీరింగ్, ఇతర డిపార్ట్‌ మెంట్స్‌ లో 1,638 పోస్టులు, స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో 2,995 టీచర్ పోస్టులున్నాయి.

AP Job Calendar 2026 latest news Good news for unemployed Job calendar released with 10 060 posts

ఇలా దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేసి, అక్టోబర్ మధ్య నాటికి మొత్తం 10,060 పోస్టుల నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు http://goir.ap.gov.in వెబ్‌ సైట్‌ లో చూడాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ అధికారులు జీవోను విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+