AP Land Titling act: డిఫెన్స్‌లో పడ్డ టీడీపీ..ఆ వీడియో వైరల్..!

AP Land Titling act: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌కు రోజులు దగ్గరపడుతున్న సమయంలో రాష్ట్ర రాజకీయాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ తిరిగి అధికారంలకి వస్తే భూములు హాంఫట్ అంటూ ప్రతిపక్షాలైన టీడీపీ జనసేనలు ప్రజల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. అందులో ఎలాంటి వాస్తవం లేదని టీడీపీ కూటమి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి చివరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ కౌంటర్ ఇస్తోంది.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉద్దేశం ఏంటి..?

లాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన ఉద్దేశం అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ అవుతుంది. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమితో పాటు అది ఏ శాఖ పరిధిలోనిదైనా సరే, ఏ వ్యక్తికి సంబంధించినదైనా సరే, దాని హక్కుదారు ఎవరని చెప్పేందుకు ఒకే రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, ఇతరత్రా తప్పులను, సమస్యలను కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం భావించింది. ఇక ఇది జరిగితే ఇదే చట్టపరంగా కంక్లూజివ్ రికార్డుగా చూపుతారు. ప్రస్తుతం ఉన్న ప్రిజంప్టివ్ రికార్డుల ప్రకారం ఎవరైనా ఫలానా భూమి తమదేనని చెప్పుకుంటూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలయితే అసలు హక్కుదారుడికి చెందిన భూమి తమదంటూ అభ్యంతరం వ్యక్తం చేసే ఛాన్స్ ఉండదు.ఈ విషయాన్నే ప్రతిపక్షాలు బూచిగా చూపి అసలు కోర్టుకు వెళ్లే హక్కు లేదనే దుష్ప్రచారం చేస్తున్నాయంటూ వైసీపీ మండిపడుతోంది.

AP Land Titling act TDP in defence after a video circulates supporting the land titling act

డిఫెన్స్‌లో పడ్డ టీడీపీ

ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల భూ యజమానులకు భరోసా దక్కుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇదొక మంచి సంస్కరణ అవుతుందని పేర్కొంటున్నారు. అయితే ఎన్నికల వేళ విపక్షాలు తప్పుగా ప్రచారం చేయడాన్ని వైసీపీ తప్పుబడుతోంది. టీడీపీకి అండగా ఉండే ఒక మీడియానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా చక్కగా వివరించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన యూటర్న్ తీసుకోవడంతో ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో టీడీపీ ఒక్కింత ఇరుకున పడింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అసెంబ్లీలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కూడా మద్దతుగా మాట్లాడిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోంది. మరి అప్పుడు మంచిగా కనిపించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు మాత్రం మరోలా కనిపిస్తోందా అంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ.

ప్రధాని మోదీతో చెప్పించగలరా..?

ఈ చట్టం తీసుకొచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్ కాబట్టి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌ తప్పుడు తడక అని భాగస్వామిగా ఉన్న టీడీపీ-జనసేనలు ప్రధాని మోదీతో చెప్పించగలరా అంటూ వైసీపీ సవాల్ విసురుతోంది. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా తెలిపారు. పైగా భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నప్పుడే టైటిల్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్‌ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. దీనివల్ల మోసం జరగడానికి వీలు లేకుండా పోతుంది. అయితే ఈసారి ఓటమి అంచున ఉన్న విపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ఏదో జరిగిపోతోందనే భయాందోళనలు సృష్టిస్తోందని ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మొద్దని వైసీపీ చెబుతోంది. అంతేకాదు సీఎం జగన్ తన ఎన్నికల ప్రచార సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు సంబంధించి స్పష్టంగా వివరిస్తున్నారన్న విషయాన్ని కూడా వైసీపీ గుర్తుచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+