ఏపీలో బీఆర్ఎస్ - సీఎం కేసీఆర్ తో రాష్ట్ర నేతలు భేటీ : ఆ ఓట్ బ్యాంక్ పైనే గురి..!!

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ దిశగా అడుగులు మొదలయ్యాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ బాధ్యతలను ఎంపిక చేసిన మంత్రులకు సీఎం కేసీఆర్ అప్పగించారు. ఏపీలో బీఆర్ఎస్ రాజకీయ అడుగుల పైన ఆసక్తి ఉంది. సీఎం జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు..చంద్రబాబుతో ఉన్న రాజకీయ వైరంతో ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ పైన భిన్న అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఏపీకి చెందిన పలువురు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ ఏర్పాటు..విస్తరణ దిశగా చర్చలు చేసారు. కార్యాచరణ డిసైడ్ చేసారు.

ఏపీలో బీఆర్ఎస్ ఏర్పాటు - కేసీఆర్ ఆమోదం

ఏపీలో బీఆర్ఎస్ ఏర్పాటు - కేసీఆర్ ఆమోదం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటికే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ అధికారిక లాంఛనాలు పూర్తయ్యాయి. ఢిల్లీలోనూ కార్యాలయం ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఉన్న అవకాశాల పైన ముందుగా పోకస్ చేసారు. అందులో భాగంగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు నిర్ణయించారు. వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా పార్టీ అజెండాను ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు. ఈ లోగా సరిహద్దున ఉన్న ఈ మూడు రాష్ట్రాల్లోనూ రాష్ట్ర శాఖల ఏర్పాటుకు నిర్ణయించారు.

ఏపీలో బీఆర్ఎస్ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. వారికి ముఖ్యమంత్రి తన పార్టీ లక్ష్యాలను వివరించారు. ఏపీలో పార్టీ శాఖ ఏర్పాటుకు అనుమతించారు. త్వరలోనే పార్టీ నేతలు ఏపీలో పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని డిసైడ్ చేసారు.

ఏపీకి బీఆర్ఎస్ నేతలు - సమావేశాలు

ఏపీకి బీఆర్ఎస్ నేతలు - సమావేశాలు

ఏపీలో త్వరలోనే బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విస్తరణ దిశగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి చెందిన బీసీ ఫెడరేషన్ ఏపీ అధ్యక్షుడు రామక్రిష్ణ యాదవ్ నాయకత్వంలో ఏపీ పద్మశాలీల సంఘం నాయకులు దివి కోట్ేటశ్వర రావు, మల్లేశ్వర రావు, సామాజిక వేత్త తోటకూర కోటేశ్వర రావు, స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర రావు, బీసీ సంఘం నేత రామనాధం అంజన్ రావు సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు.

రాజకీయంగా యాక్టివ్ గా పని చేసిన సీనియర్లు కొందరు బీఆర్ఎస్ లో పని చేయటానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, పార్టీ నిర్మాణం.. ఏపీలో విస్తరణ సమయంలో వారు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీని ప్రగతి పథంలో నడిపించగల సత్తా కేసీఆర్ కు ఉందని బీఆర్ఎస్ లో పని చేయటానికి ఆసక్తి చూపుతున్న నేతలు చెప్పుకొచ్చారు.

ఏపీలో ఆ ఓట్ బ్యాంకు పైనే గురి

ఏపీలో ఆ ఓట్ బ్యాంకు పైనే గురి

ఏపీలో ఎన్నికల రాజకీయం పూర్తిగా సామాజిక సమీకరణాలపైనే ఆధార పడి ఉంటుంది. ఇప్పుుడు తమతో కలిసి వచ్చే వారెవరనే దాని పైన బీఆర్ఎస్ నేతలు పలువురితో చర్చలు చేస్తున్నట్లు సమాచారం. అందునా..ప్రధానంగా ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయి. బీజేపీ పాలన, ఆ పార్టీని వ్యతిరేకించే వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

తెలంగాణ తరహాలో ఏపీలోనూ వామపక్ష పార్టీలతోనూ జత కట్టే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. బీసీ వర్గాల నేతలు ఇప్పుడు సీఎం కేసీఆర్ ను కలవటం ద్వారా..ఆ వర్గాల నుంచి ఏపీలో బీఆర్ఎస్ ఏ మేర మద్దతు లభిస్తుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇదే సమయంలో.. ఏపీలో మూడు ప్రధాన పార్టీలు బలంగా ఉన్న పరిస్థితులు.. కేసీఆర్ కు ఏపీలో పార్టీల అధినేతలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఏపీలో వేసే అడుగులు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+