వృధా జలాలు తెలంగాణా కోటాలోనే ; శ్రీశైలం విద్యుదుత్పత్తిపై కృష్ణా బోర్డుకు ఏపీ మరో లేఖ !!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం తీరుపై పదే పదే లేఖలు రాస్తున్నా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పందించడం లేదా ? ఇప్పటికే పలుమార్లు తెలంగాణ జెన్కో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తోందని, తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖలు రాసినా ఇప్పటివరకు తెలంగాణ సర్కార్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదా ? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పట్టించుకోవడంలేదని తెలిసికూడా ఏపీ సర్కార్ తెలంగాణ నీటి వాడకంపై పదేపదే లేఖలు రాయడం ఒత్తిడి పెంచడంలో భాగమేనా? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది.

జలవివాదాలను తగ్గించటంలో ఫెయిల్ అవుతున్న కృష్ణా రివర్ బోర్డు
రాయలసీమ ఎత్తిపోతల వివాదం ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని మరింత పెంచిన విషయం తెలిసిందే. ఇటు ఏపీ లేఖలు, అటు తెలంగాణా రాస్తున్న లేఖలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సతమతమవుతుంది. ఎంతగా ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నా అవి సఫలీకృతం కావటం లేదు . తెలంగాణ రాష్ట్రం రాయలసీమ ఎత్తిపోతల పై ఫిర్యాదు చేయడంతో తాజాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఎన్జీటీకి నివేదికను సమర్పించింది . ఇక తెలంగాణా ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీ విషయంలో స్పందించడంలేదని ఏపీ వాసుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిపై పదేపదే లేఖాస్త్రాలు
తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్టులో సాగిస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు పదే పదే లేఖలు రాస్తూనే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో సాగిస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూనే ఉంది. ఇక తాజాగా మరోమారు కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న రచ్చకు కొనసాగింపుగా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదుత్పాదన పై ఫిర్యాదు చేస్తూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కెఆర్ఎంబి సభ్య కార్యదర్శి కి ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి లేఖ రాశారు.

విద్యుత్ ఉత్పత్తి చేస్తే రాయలసీమకు నీరిచ్చే అవకాశం లేదు
కృష్ణా జలాల వినియోగం పై గతంలో ఏదైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారో ప్రస్తుతం రాసిన లేఖలో కూడా అదే విధంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అవసరం లేకున్నా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని చేస్తున్నారని, దీంతో నీటి మట్టం తగ్గుతోందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలుపుదల చేయాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ను విజ్ఞప్తి చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి ఇదే విధంగా కొనసాగితే రాయలసీమకు నీరిచ్చే పరిస్థితి ఉండదని లేఖ ద్వారా స్పష్టం చేసింది..

తెలంగాణా కారణంగా వృధాగా పోతున్న నీరు.. వారి కోటా నుండే
నీటిమట్టం 854 అడుగులకు చేరితే కానీ రాయలసీమకు నీరు ఇవ్వలేమని లేఖలో ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. చెన్నైకి తాగునీటి కూడా సరఫరా చేయలేమని వెల్లడించారు. విద్యుదుత్పాదనతో వస్తున్న నీటిని సాగర్లో నిలపలేమని ఈఎన్సీ పేర్కొన్నారు. మరోవైపు దిగువన ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ లో నీటి నిల్వకు అవకాశం లేదని లేఖలో వెల్లడించారు. విద్యుదుత్పాదన కారణంగా చాలా జలాలు వృథాగా పోతున్నాయి అని పేర్కొన్నారు. వృధాగా పోతున్న జలాలను, తెలంగాణ కోటా నుండి మినహాయించాలని ఏపీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులు రాసిన లేఖలో పేర్కొంది. ఇక తమ నీటి వినియోగంపై టార్గెట్ చేస్తున్న తెలంగాణా సర్కార్ కు విద్యుత్ ఉత్పత్తి నిలిపివెయ్యాలని డిమాండ్ చేస్తూ షాక్ ఇస్తున్నారు .

హంద్రి నీవా నుండి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూదాలంటున్న తెలంగాణా లేఖ
ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కూడా లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం అని స్పష్టం చేశారు . హంద్రీ-నీవా నుంచి కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది నుండి బేసిన్ ఆవలకు నీటి మళ్లింపును బచావత్ ట్రిబ్యునల్ అనుమతించలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు . నీటిని ఆ విధంగా తరలించడం వల్ల బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని 700 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించడం అన్యాయమని ఆయన లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఇక అంతకు ముందు ఏపీ ప్రభుత్వం నీటి వాటాల విషయంలోనూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

నీటి కేటాయింపులపైనా ఏపీ లేఖ .. తెగేలా లేదుగా
కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిందని, ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు పైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని ఏపీ సర్కార్ లేఖలో స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో తెలంగాణా ప్రతిపాదించిన 50: 50 ఫార్ములా సమంజసం కాదని జగన్ సర్కార్ రాసిన లేఖలో పేర్కొంది. వాస్తవానికి ఏపీకి 70 శాతం, తెలంగాణకు 30 శాతం కేటాయింపులు జరపాల్సి ఉందని ఈ ఏడాది నీటి కేటాయింపులు ఈ ప్రాతిపదికన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డు కు విజ్ఞప్తి చేసింది. ఇక తాజాగా మళ్ళీ శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిని టార్గెట్ చేసింది. ఇక ఈ జలజగడం తెగేలా కనిపించటం లేదని రెండు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications