ఏపీలో బీర్లు కూడా కల్తీనే .. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కల్తీ మద్యం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు కేవలం మద్యాన్ని (Liquor) మాత్రమే కల్తీ చేస్తున్నారని భావించిన మందు బాబులకు, తాజాగా మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఏకంగా బీరు( Beer) బాటిల్స్‌లోనూ కల్తీ జరుగుతోందని తెలుస్తోంది.
ఒంగోలు లో నకిలీ బీరు కలకలం!
— greatandhra (@greatandhranews) October 14, 2025
కల్తీ మద్యం కనుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ తో బీర్ బాటిల్ మీద ఉన్న QR కోడ్ ను స్కాన్ చేస్తే ఎర్రర్ రావడంతో ఈ భాగోతం బయటపడింది.
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో కల్తీ మద్యం కాక రేపుతున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/oG3h6spQGS
వివరాల్లోకి వెళ్తే... ఓ వ్యక్తి స్థానిక వైన్స్ షాపులో బీరు కొనుగోలు చేయగా, దానిని తెరిచి చూడగా అది కేవలం నీరు మాత్రమేనని గుర్తించారు. తీవ్ర ఆగ్రహంతో అతను తిరిగి వైన్ షాప్‌కి వచ్చి నిర్వాహకులను ప్రశ్నించగా... సిబ్బంది మరింత నిర్లక్ష్యంగా, కావాలంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని బదులివ్వడం ఈ దందాకు అద్దం పడుతోంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది.

తాము కొన్నది నిజమైన బీరా లేక కల్తీ చేసిన నీరా అనే భయంతో ఏపీ మందు బాబులు భయంతో వణికిపోతున్నారు. రాష్ట్రంలో వైన్స్ షాపుల్లోనే ఇలాంటి కల్తీ జరుగుతుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది అసలు మందో, ఏది కల్తీనో తెలియక కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు తక్షణమే దృష్టి సారించి, కల్తీ దందాకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఏపీ మొత్తం కల్తీ మద్యం..
— 🇱🇸Shaik.saleem saleem🇱🇸 (@Shaiksaleemsale) October 13, 2025
గన్నవరంలో కల్తీ బీరు. pic.twitter.com/ZJkbplgMv6












Click it and Unblock the Notifications