Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ 11 కోట్లపై బిగ్ ట్విస్ట్..! కోర్టులో రాజ్ కెసిరెడ్డి కీలక అఫిడవిట్..!

ఏపీ మద్యం స్కాంలో దర్యాప్తు జరుపుతున్న సీఐడీ సిట్ అధికారులు ఇవాళ ఉదయం సంచలన వివరాలు బయటపెట్టారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ వద్ద ఓ ఫామ్ హౌస్ లో మద్యం కేసులో ప్రదాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి దాచిన 11 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు లీక్ ఇచ్చారు. ఈ కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఎయిర్ పోర్టులో పారిపోతుండగా దొరికాడని, అతను ఇచ్చిన సమాచారంతో ఫామ్ హౌస్ పై దాడులు చేసి ఈ మొత్తం సీజ్ చేసినట్లు తెలిపారు.

అయితే ఈ ఆరోపణల్ని రాజ్ కెసిరెడ్డి తోసిపుచ్చాడు. సిట్ దర్యాప్తును పక్కదోవ పట్టిస్తూ తనకు బెయిల్ రాకుండా చేసేందుకే ఈ కట్టుకథ అల్లిందని ఆరోపిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించాడు. సిట్ సీజ్ చేసిన డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో రాజ్ కసిరెడ్డి పేర్కొన్నాడు. తన భార్య మైనర్ షేర్ హోల్డర్ గా ఉన్న ఆస్పత్రి యాజమాన్యంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

ap liquor scam A1 raj kesireddy denied connection with rs 11 cr seized by SIT

సిట్ ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తవమని రాజ్ కేసిరెడ్డి వెల్లడించాడు. ఫామ్ హౌస్ యజమాని తీగల విజయానంద రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్నారని, వాటి వ్యాపారాలు వందల కోట్ల మేర ఉన్నాయని కెసిరెడ్డి తెలిపారు. ఈ వెంచర్లలో తనకు లేదా తన భార్యకు ఎటువంటి ప్రమేయం లేదన్నారు. . తన భార్యకు ఆరెటే ఆసుపత్రిలో కనీస వాటా మాత్రమే ఉందని, తీగల విజయానంద రెడ్డి వ్యాపారాలతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

తనకు బెయిల్ రాకుండా చేసేందుకే సిట్ ఈ డబ్బుల వ్యవహారాన్ని కుట్ర పూరితంగా తెరపైకి తెచ్చిందని ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కెసిరెడ్డి పేర్కొన్నారు. అయితే సిట్ మాత్రం ఈ డబ్బు మద్యం స్కాంకు చెందినదేనని చెబుతోంది. ఇప్పటికే రూ.3500 కోట్ల మేర ఈ స్కాం జరిగిందని ఆరోపిస్తూ కనీసం 100 కోట్లు కూడా పట్టుకోవడంలో విఫలమైన సిట్ .. ఇలా డబ్బు చూపించే ప్రయత్నం చేసి రాజ్ బెయిల్ అడ్డుకుంటోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+