వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ మరో యూ టర్న్: పాత మిత్రులతో కొత్త పొత్తు.. సక్సెస్ అయ్యేనా..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయంగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల షెడ్యూల్ ఏ క్షణంలో అయినా విడుదల అయ్యే అవకాశం ఉండటంతో...పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ..జనసేన కలిసి పోటీ చేస్తామని ప్రకటించగా..టీడీపీ సైతం పొత్తుల దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా...దాదాపు దశాబ్ద కాలం పాటు దూరంగా ఉన్న పాత మిత్రులకు కలుపుకుపోయే ప్రయత్నాల ను ముమ్మరం చేసింది.

 కమ్యూనిస్టులతో పొత్తు ..ముహూర్తం ఖరారు

కమ్యూనిస్టులతో పొత్తు ..ముహూర్తం ఖరారు

టీడీపీ మరోసారి పాత మిత్రులను కలుపుకుని పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు యత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే టీడీపీతో ఏపీలో సీపీఐ దగ్గరగా వ్యవహరిస్తోంది. అయితే, సీపీఎం మాత్రం దూరంగానే ఉంటుంది. ఇప్పుడు సీపీఎంను కూడా కలుపుకుపోవాలని భావిస్తున్న టీడీపీ..వారిని ఒప్పించే బాధ్యతలను సీపీఐ నేతలకు అప్పగించింది. ఈ మూడు పార్టీ ల కొత్త పొత్తు పైన ఈ నెల 8వ తేదీన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

వామపక్షాలతో టీడీపీ పొత్తు దిశగా..

వామపక్షాలతో టీడీపీ పొత్తు దిశగా..


రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు యత్నాలు మొదలయ్యాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సీపీఐ నేతలు కె.రామకృష్ణ, నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, హరనాథరెడ్డి భేటీ అయ్యారు. కలిసి పోటీచేసే అంశంపై వారి మధ్య కొంత చర్చ జరిగింది. ఈ నెల 8న ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమావేశం జరుగుతుందని, ఉభయులం కలిసి ఒకే వైఖరితో వెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని, తర్వాత మరోసారి కలుస్తామని సీపీఐ నేతలు చెప్పినట్లు సమాచారం.

 సీపీఎం ఒప్పించే బాధ్యత సీపీఐదే

సీపీఎం ఒప్పించే బాధ్యత సీపీఐదే

అమరావతి నుండి రాజధాని మార్పు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్ర బాబుతో సీపీఐ నేత రామకృష్ణ కలిసి నడుస్తున్నారు. సీపీఎం మాత్రం దూరంగానే ఉంటుంది. 2009 ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి ఓడిన తరువాత ఈ మూడు పార్టీలు తిరిగి పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా సీపీఎం పార్టీ టీడీపీతో పొత్తు కోసం ఎంత వరకు అంగీకరిస్తుందనేది సందేహాంగానే ఉంది. సీపీఎం ను ఒప్పించే బాధ్యతను సీపీఐ నేతలకు టీడీపీ అప్పగించింది. అవసరమైతే ఏచూరీతోనూ మాట్లాండేందుకు సిద్దమని టీడీపీ ముఖ్య నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం.

Recommended Video

AP Local Body Polls : Watch TDP Leaders Met State Election Commissioner | Oneindia Telugu
 పవన్ బీజేపీతో కలవటంతో..

పవన్ బీజేపీతో కలవటంతో..

ఇక, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలు..జనసేనతో కలిసి పోటీ చేసాయి. కానీ, ఆశించిన ఫలితాలు రాలేదు. జనవరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తాను వామపక్షాలకు బాకీ లేనని వ్యాఖ్యానించారు. దీంతో..సీపీఐ వెంటనే టీడీపీతో జత కట్టేందుకు ఆసక్తి చూపించింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ పరాజయం పాలయింది. ఇప్పుడు తమ పాత మిత్రులు పవన్..బీజేపీ ఒక్కటవ్వటం...వైసీపీ అధికారంలో ఉండటంతో..భవిష్యత్ లో ప్రజా పోరాటాల కోసం ముందుగానే వామపక్షాల మద్దతు కూడగట్టాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగా..స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చింది. దీని పైన ఈ నెల 8న అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
With BJP and janasena going together in the AP local body elections, TDP has once again reached its old friend communist parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X