స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంలో కీలక పరిణామాలు..!!
ఏపీలో స్థానిక ఎన్నికల వ్యవహారం సుప్రీంకు చేరింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు పై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో, ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. బీసీ రిజర్వేషన్ల అమలుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఇదే సమయంలో అటు వైసీపీ సైతం సర్ ప్రక్రియ పూర్తయి.. ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను తోసిపుచ్చారు. దీంతో.. వైసీపీ సైతం సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో.. సుప్రీం కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు వ్యవహారం పై ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించటం తో సర్వోన్నత న్యాయ స్థానం నిర్ణయం కీలకం కానుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎదుట ఏపీ ప్రభుత్వం మెన్షన్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్‌లో ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయాలనే నిబంధనేమీ లేదని తెలిపింది. ప్రభుత్వ జీవోలతో గ్రామీణ స్థానిక సంస్థల రిజర్వేషన్లు 61.08 శాతానికి చేరినా, పట్టణ స్థానిక సంస్థల రిజర్వేషన్లు మాత్రం 49.24 శాతానికే పరిమితం అవుతున్నాయని పేర్కొంది. అయినా హైకోర్టు 50 శాతం పరిమితి పేరుతో రెండు జీవోలనూ కొట్టివేసిందని తెలిపింది. సమగ్ర వివరాలు ఉంటే అంతకుమించి కూడా ముందుకు వెళ్లొచ్చని గతంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక తీర్పు లు ఇచ్చిన అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రస్తావన చేసింది. ఈ పిటీషన్ పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావన చేసింది.

సుప్రీం తీర్పు ఆధారంగా నిర్ణయం
కాగా.. ఈ కేసు పైన ఈ నెల 9న విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక.. మరో వైపు ఏపీలో స్థానిక ఎన్నికలు.. వార్డుల విభజనతో పాటుగా సర్ ఓటర్ల జాబితా అంశాల పైన హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పాత ఓటర్ల జాబితాతో కాకుండా, పూర్తిస్థాయిలో ఎస్ఐఆర్ (SIR) ఓటర్ల జాబితా సిద్ధమైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ న్యాయవాది ప్రధాన జస్టిస్ (CJI) ధర్మాసనం ముందు కోరారు. .మున్సిపాలిటీ సరిహద్దుల ఫ్రీజింగ్ నిబంధన వార్డులకు వర్తించదని, వార్డుల సరిహద్దులు ఫ్రీజ్ కావని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీంతో అటు ప్రభుత్వం దాఖలు చేసిన బీసీ రిజర్వేషన్ల వ్యవహారం పైన 9వ తేదీన విచారణ తరువాత కోర్టు వెల్లడించే నిర్ణయం ఆధారంగా స్థానిక ఎన్నికల పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.













Click it and Unblock the Notifications
