వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కదలికపై బాబు దృష్టి: తెలంగాణ ఏసీబీకి ఏపీ నోటీసులిచ్చేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ఏసీబీకి నోటీసులు పపించనుందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఇంతటితో చెక్ చెప్పేందుకు ఓ వైపు ప్రయత్నాలు సాగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు దూకుడుగా కూడా వెళ్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు చెక్ చెప్పేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే, మరోవైపు దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే, చంద్రబాబు అధికారులను వారించడం గమనార్హం.

AP may send notice to Telangana ACB

చంద్రబాబు - స్టీఫెన్ సన్ మాట్లాడుకున్నట్లుగా భావిస్తున్న ఆడియో టేపులు బయటకు వచ్చాయి. దీనిపై విశాఖ పోలీసులు టీ న్యూస్, సాక్షి ఛానళ్లకు నోటీసులు అందించారు. అదే విధంగా తెలంగాణ ఏసీబీకి కూడా నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

అయితే, ఇలాంటి పరిస్థితుల్లో వద్దని, రెండు మూడు రోజులు చూద్దామని చంద్రబాబు అధికారులతో మాట్లాడారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో, అధికారులు రెండు మూడు రోజులు ఆగి ఆ తర్వాత ఏసీబీకి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలించనున్నారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కదలికలను బట్టి ఏపీ ముందుకెళ్లనుంది.

English summary
The AP government has decided to continue its aggressive stance as there were no signals from TS government on a let up over the cash-for-vote scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X