అదే జరిగితే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా::అచ్చెన్నాయుడు
బీసీలకు అన్యాయం జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
విజయవాడ: బీసీలకు అన్యాయం జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
అనివార్య కారణాలతో కాపు రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యమౌతోందన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లకు కల్పిస్తామన్నారు.

కాపులకు రిజర్వేషన్లను కల్పించే విషయంలో బీసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటోందని ఆయన చెప్పారు. బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఏనాడూ కూడ లేదన్నారు.
బీసీలకు అన్యాయం జరిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అచ్చెన్నాయుడు చెప్పారు.












Click it and Unblock the Notifications