చంద్రబాబు ఇంకా ఎదుర్కోవాల్సింది ఉంది - మంత్రి అంబటి..!!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అనివార్యంగా మారిందని మంత్రులు చెప్పుకొచ్చారు. పురందేశ్వరి, పవన్ కల్యాణ్ టీడీపీ అధినేతకు మద్దతు ప్రకటించారు. దీని పైన మంత్రులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబును కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవినీతి చేసినట్లుగా అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పైన మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు ఈ కేసే కాదని, ఇంకా ఎదుర్కోవాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు‌కాదని, అనివార్యమైందనితెలిపారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని భావించారు కానీ అవేవీ జరగలేదని అన్నారు. భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని పేర్కొన్నారు. సీఐడీవారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వలన కేసుకు అనుగుణంగా వారు వ్యవహరించారని చెప్పారు. స్కిల్ కేసులో ఇప్పుడు అరెస్టు అయ్యారని.. ఇంకా రింగు రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు ముందు చాలా లోతైన విచారణ జరిగిందన్నారు.

AP Minister Ambati Rambabu made Serious comments on Chandra Babu, supports CID Decision

షెల్ కంపెనీలకు డబ్బు తరలించి, తర్వాత తన ఖాతాలోకి వేసుకున్నట్టు తేలిందని పేర్కొన్నారు. సీమెన్స్ కంపెనీతో సంబంధం లేకుండానే వ్యవహారం నడిపారన్నారు. ఆ కంపెనీ కూడా ఈ విషయం చెప్పిందని, రూ.330 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని లూటీ చేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని తమకు తెలియదాఅని ప్రశ్నించారు. కానీ వ్యవస్థలు సక్రమంగా పని తమపని తాము చేసుకునేలా ఫ్రీహ్యాండ్ ఇచ్చామని చెప్పారు. చట్టబద్దంగానే సీఐడీ అరెస్టు చేసిందని వివరించారు రోడ్డుమీదకు వచ్చి గొడవలు చేస్తే సహించేదిలేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే అణిచివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ సొమ్ము కాజేసిన సంగతిని పవన్ కల్యాణ్‌ తెలుసుకుని మాట్లాడాలన్నారు. వాసస్తవాలు తెలియాలంటే ఆ వివరాలు మేము పవన్‌కు పంపిస్తామని అంబటి చెప్పుకొచ్చారు.

ఒక దోపిడీ దారునికి పవన్ కల్యాణ్‌ వత్తాసు పలకటం ఏంటని అంబటి ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షురాలు కూడా మా బావ అవినీతి చేయలేదని చెప్పటం లేదన్నారు. అరెస్టు ప్రొసీజర్ గురించే ఆమె మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకానీ మా బావ నీతిమంతుడని చెప్పలేదంటేనే అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. లోకేష్ పాత్ర కూడా ఉందని తేలితే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రాజకీయ కక్షతో బాబును అరెస్ట్‌ చేయించాల్సిన అవసరం తమకు లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తప్పు చేశానని చంద్రబాబుకు తెలుసని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+