ఏపీలో సచివాలయాల ఉద్యోగులకు సర్కార్ బంపర్ ఆఫర్..!
ఏపీలో వైసీపీ హయాంలో నెలకొల్పిన సచివాలయాల వ్యవస్థ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం సచివాలయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఉద్యోగుల హేతు బద్ధీకరణతో వాటిని గాడిన పెడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హేతు బద్దీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీంతో ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ అందింది.
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కార్యదర్శుల్ని హేతుబద్ధీకరణ పేరుతో తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఓసారి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాక వారిని అలా తొలగించడం కుదరదు. కాబట్టి ఇతర శాఖల్లో సర్దుబాటు చేయక తప్పని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు.

గుంటూరులో ఆంధ్ర ప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్, రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ ఉద్యోగుల సంఘం సంయుక్త సర్వసభ్య సమావేశంలో పాల్గొని డైరీ ఆవిష్కరించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ .. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ పోస్టులను సచివాలయ సిబ్బంది చేత భర్తీ చేయిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో హేతు బద్ధీకరణ తర్వాత సచివాలయ ఉద్యోగుల్ని తీసుకోబోతున్న తొలిశాఖ రిజిస్ట్రేషన్ల శాఖే కానుంది. మంత్రి ప్రకటనతో ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications