Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏ క్షణమైనా రాజధానులు- దుష్టశక్తుల అడ్జు- ఎక్కడినుంచైనా సీఎం పాలన-బొత్స కామెంట్స్

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభించి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ దానిపై ముందడుగు వేయడంలో ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధానులపై ఆశలు రేకెత్తించారు. ఏ క్షణమైనా మూడు రాజధానులు అంటూ పాతపాడే పాడారు. ఈ ఏడాది రాజధాని తరలింపు లేదని ఇప్పటికే తేలిపోయినా ఈ ఏడాది, ఆ ఏడాది అంటూ ఏమీ లేదంటూ తేల్చేశారు. దీంతో రాజధానుల వ్యవహారంపై ప్రభుత్వంపై ఎదురవుతున్న విమర్శల్ని కప్పిపుచ్చేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఏ క్షణమైనా మూడు రాజధానులు

ఏ క్షణమైనా మూడు రాజధానులు

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ఆరంభించి ఏడాదిన్నర పూర్తయింది. గతేడాది కరోనాతో రాజధాని తరలింపు జరగలేదని భావించినా ఈసారి కూడా ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్ధితి ఎదురైంది. దీంతో ఇక ముచ్చటగా మూడో ఏడాదే తరలింపు ప్రయత్నాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కారులో కీలకమంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారుయ ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటవుతాయని ప్రకటించారు. ఈ ఏడాది రాజధాని తరలిపోతుందా అని అఢిగితే ఈ ఏడాది ఆ ఏడాది అని లేదు, ఏ క్షణమైనా ప్రక్రియ మొదలవుతుందన్నారు.

 టీడీపీది పైశాచికానందం

టీడీపీది పైశాచికానందం


మూడు రాజధానుల కోసం ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నాయని, కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని మున్సిపల్ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ, రాజధాని రైతులు పిటిషన్లు వేసిన నేపథ్యంలో వారిని ఉద్దేశించే బొత్స ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్లకూడదని టీడీపీ నేతల కోరికని బొత్స వ్యాఖ్యానించారు. వారిది పైశాచికానందమన్నారు.

 శాసనసభలో చట్టమే ఫైనల్‌

శాసనసభలో చట్టమే ఫైనల్‌


మూడు రాజధానుల ఏర్పాటు కోసం శాసనసభలో ఏ చట్టం చేశామో అది జరిగితీరుతుందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న చర్చలో శాసనసభలో గతంలో ప్రభుత్వం ఆమోదించిన చట్టాలే ఫైనల్‌ అని మంత్రి బొత్స చెప్పినట్లయింది. ఇప్పటికే శాసనసభ ఆమోదించిన బిల్లులపై హైకోర్టులో పిటిషన్లు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

 ఎక్కడి నుంచేలా పాలించొచ్చు

ఎక్కడి నుంచేలా పాలించొచ్చు

సీఎం ఎక్కడి నుంచైనా పాలించొచ్చంటూ మంత్రి బొత్స మరో కీలక వ్యాఖ్య చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ డోలాయమానంలో పడిన నేపథ్యంలో విశాఖ నుంచి పాలనకు జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో విశాఖలో గెస్ట్‌హౌస్‌కూ ఇంకా అనుమతులు రాలేదు. దీంతో సీఎం జగన్ విశాఖకు ఎలా వెళ్తారన్న చర్చ కూడా సాగుతోంది. దీనికి చెక్‌ పెడుతూ సీఎం ఎక్కడినుంచైనా పాలించొచ్చంటూ బొత్స క్లారిటీ ఇచ్చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+