అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ ను ఎవరైనా గ్యాంగ్ రేప్ చేశారా?

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం సంభవించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో విజయవాడలో సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, అన్ని పార్టీలను కలుపుకు వెళ్లాలని నిర్ణయించారు. దీనిపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. ''విశాఖపట్నంలో ఏం జరిగిందని అంతగా హడావిడి చేస్తున్నారు?

పవన్ కల్యాణ్ పై హత్యాయత్నం జరిగిందా? గ్యాంగ్ రేప్ జరిగిందా? ఏం జరిగిందని చంద్రబాబు పవన్ ను పరామర్శించారని'' ప్రశ్నించారు. ''జనసేన నాయకులు, కార్యకర్తలు మంత్రులపై దాడిచేశారని, పరామర్శిస్తే మంత్రులను పరామర్శించాలికానీ పవన్ ను పరామర్శించడం ఏమిటని'' నిలదీశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంటే ఇదేనా? అన్నారు.

ap minister gudivada amarnath comments on janasena chief pawan kalyan

రేపటి నుంచి కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేస్తాయని పవన్ చెప్పారని, కానీ ఒక్క రోజు కూడా ఆగలేకపోయారా? అన్నారు. మీ కలయిక రోడ్డుపైకి వచ్చేసిందని, ఇంతకాలం ప్రజల్ని ఎందుకు మోసం చేశారన్నారు. మీరంతా కలిసే వస్తారో.. లేదంటే ఇంకేమైనా చేస్తారో మీ ఇష్టం.. ప్రజలు మీకు బుద్ధి చెపుతారని వ్యాఖ్యానించారు.

చెప్పుతో కొడతానంటున్నారని, మా దగ్గర చెప్పులు లేవా? అని మంత్రి పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ఫ్రస్టేషన్ ఎక్కువై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, పళ్లు రాలగొట్టడం, ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడం అంటే భీమవరంలో, గాజువాకలో జరిగాయని సెటైర్ వేశారు. పవన్ దగ్గర చెప్పులు, పళ్లు ఉంటే వైసీపీ దగ్గర ఎన్ని ఉండాలన్నారు. తాను అనేక రకాలుగా మాట్లాడతానని ఏం చేస్తాడో రమ్మనండంటూ అమర్నాథ్ సవాల్ విసిరారు. తామంతా అడవిలో లేమని, సమాజంలో ఉన్నామని, వచ్చి ఎవరిని కొట్టేస్తావ్? అంటూ నిలదీశారు. చిరంజీవి లేకపోతే నువ్వెక్కడుండేవాడివో ప్రశ్నించుకోవాలని హితవు పలికారు.

English summary
minister gudivada amarnath fire on pawan kalyan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X